Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నిర్మలా సీతారామన్
ABN , Publish Date - Jun 12 , 2024 | 03:58 PM
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ బుధవారంనాడు బాధ్యతలు చేపట్టారు. మోదీ మంత్రివర్గంలో వరుసగా రెండోసారి ఆర్థిక మంత్రిత్వ శాఖను చేపట్టిన తొలి మహిళగా ఆమె రికార్డుకెక్కారు. కేంద్ర మంత్రివర్గంలో వరుసగా మూడోసారి చోటు దక్కించుకున్న మహిళగా కూడా నిలిచారు.
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి (Union Finance Minister)గా నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) బుధవారంనాడు బాధ్యతలు చేపట్టారు. మోదీ మంత్రివర్గంలో వరుసగా రెండోసారి ఆర్థిక మంత్రిత్వ శాఖను చేపట్టిన తొలి మహిళగా ఆమె రికార్డుకెక్కారు. కేంద్ర మంత్రివర్గంలో వరుసగా మూడోసారి చోటు దక్కించుకున్న మహిళగా కూడా నిలిచారు.
First Lok Sabha Session: 18వ లోక్‌సభ సమావేశాలు ఈనెల 24 నుంచి ప్రారంభం..ఎప్పటి వరకంటే
ఆర్థిక మంత్రిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించేందుకు బుధవారంనాడు నార్త్ బ్లాక్ కార్యాలయానికి చేరుకున్నప్పుడు ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్, ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల కార్యదర్శులు ఆమెకు సాదర స్వాగతం పలికారు. త్వరలోనే 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. కాగా, మోదీ తొలి విడత మంత్రివర్గంలో (2014) పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ బాధ్యతలు చేపట్టారు. 2017లో కీలకమైన రక్షణ శాఖ బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత 2019లో రెండోసారి ప్రధాని మోదీ ఎన్నికైన తర్వాత ఏర్పాటైన కేంద్ర మంత్రి వర్గంలోనూ చోటు దక్కించుకున్న నిర్మలా సీతారామన్‌కు అత్యంత కీలకమైన ఆర్థికశాఖను అప్పగించారు. అప్పటి నుంచి దేశీయ ఆర్థిక రంగంలో మలి విడత ఆర్థిక సంస్కరణలను పరుగులెత్తించారు. కోవిడ్ సమయంలోనూ ఆర్థిక వృద్ధిని ముందుకు తీసుకువెళ్లడం ద్వారా ప్రశంసలు అందుకున్నారు.
Read Latest National News and Telugu News