Nitin Gadkari: ఢిల్లీకి రావడం ఇష్టం ఉండదు.. ఎందుకో చెప్పిన గడ్కరి
ABN , Publish Date - Dec 03 , 2024 | 05:50 PM
భారతదేశం రూ.22 లక్షల కోట్లు విలువచేసే శిలాజ ఇంధనాలను దిగుమతి చేసుకుంటోందని, ఆర్థిక, పర్యావరణ, జీవావరణ పరంగా ఇదొక సవాలని గడ్కరి చెప్పారు. ప్రత్యామ్నాయ ఇంధనాలను ప్రోత్సహించడం ద్వారా శిలాజ ఇంధనాల దిగుమతిని తగ్గించవచ్చని అన్నారు.
న్యూఢిల్లీ: మనసులో ఏదీ దాచుకోకుండా మాట్లాడటం, వాతావరణాన్ని అహ్లాద పరుస్తూ మాట్లాడటంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి (Nitin Gakari)కి పేరుంది. తాజాగా ఆయన ఢిల్లీలోని వాతావరణ కాలుష్యంపై సూటిగా స్పందించారు. దేశ రాజధాని నగరంలో నివసించడం తనకు ఇష్టం ఉండదని, కాలుష్యం ఎక్కువగా ఉండటం వల్ల ఇక్కడకు రావాలంటేనే విసుగు కలుగుతుంటుందని చెప్పారు. మంగళవారంనాడిక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ విషయం చెప్పారు.
Eknath Shinde: ఆసుపత్రి నుంచి షిండే డిశ్చార్జి.. నేరుగా అధికార నివాసానికి
''నాకు ఇక్కడ నివసించడం ఇష్టం ఉండదు. ఇక్కడి కాలుష్యం వల్ల నాకు ఇన్‌ఫెక్షన్ సోకుతోంది. ప్రతిసారి ఢిల్లీ రావాల్సి వచ్చినప్పుడు కాలుష్య తీవ్రత కారణంగా వెళ్లాలా వద్దా అనేది ఆలోచిస్తుంటాను'' అని గడ్కరి చెప్పారు. కాలుష్యం తగ్గాలంటే శిలాజ ఇంధనాల (Fossil fuels) వాడకాన్ని తగ్గించడమే ఉత్తమమైన మార్గమని ఆయన సూచించారు.
భారతదేశం రూ.22 లక్షల కోట్లు విలువచేసే శిలాజ ఇంధనాలను దిగుమతి చేసుకుంటోందని, ఆర్థిక, పర్యావరణ, జీవావరణ పరంగా ఇదొక సవాలని గడ్కరి చెప్పారు. ప్రత్యామ్నాయ ఇంధనాలను ప్రోత్సహించడం ద్వారా శిలాజ ఇంధనాల దిగుమతిని తగ్గించవచ్చని అన్నారు. కాగా, ఢిల్లీలో వరుసగా మూడోరోజైన మంగళవారంనాడు ఢిల్లీలోని గాలి నాణ్యత స్వల్పంగా మెరుగుపడింది. గాలి నాణ్యతా సూచీ (ఏక్యూఐ) 274గా ఉంది. నవంబర్‌తో పోల్చుకుంటే డిసెంబర్ మొదట్లోనే గాలి నాణ్యత మెరుగుగా కనిపించడం ఢిల్లీవాసులకు ఊరట కలిగించే విషయని అధికారులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి
Supreme Court: బెయిలు వచ్చిన మరునాడే మంత్రి పదవా...
Heavy Rains: మూడు జిల్లాలను ముంచెత్తిన ‘ఫెంగల్’
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..