Share News

Bihar: డీజీపీకి చేతులు జోడించి.. అభ్యర్థించిన సీఎం

ABN , Publish Date - Oct 21 , 2024 | 07:28 PM

బీహార్ రాజధాని పాట్నాలో కొత్తగా ఎంపికైన పోలీస్ ఉన్నతాధికారులకు పట్టాలు అందజేసే కార్యక్రమానికి సీఎం నీతీశ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం నీతీశ్ కుమార్ వ్యవహరించిన తీరు.. అందరిని ఆశ్చర్య పరుస్తుంది. ఇంతకీ ఏం జరిగిందంటే..

Bihar: డీజీపీకి చేతులు జోడించి.. అభ్యర్థించిన సీఎం

పాట్నా, అక్టోబర్ 21: జేడీ(యూ) అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వ్యవహార శైలి ఇటీవల కాలంలో పలు సందర్భాల్లో ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఆయన వ్యవహరిస్తున్న తీరు పట్ల పలువురు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా బిహార్ రాజధాని పాట్నాలో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం నీతీశ్ కుమార్ అందరినీ ఆశ్చర్య పరిచేలా వ్యవహరించారు.

Also Read: NSTR: నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో పులి సంచారం


ఇంతకీ ఏం జరిగిందంటే..

సోమవారం పాట్నాలో కొత్తగా ఎంపికైన 1,239 మంది పోలీస్ ఉన్నతాధికారులకు పట్టాలు అందజేసే కార్యక్రమానికి సీఎం నీతీశ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక్కసారిగా డీజీపీ అలోక్ రాజ్ వైపు తిరిగారు. రాష్ట్రంలో పోలీస్ రిక్రూట్‌మెంట్‌ను వేగంగా పూర్తి చేయాలంటూ ఆయనకు చేతులు జోడించి నమస్కరిస్తూ అభ్యర్థించారు.

దీంతో ఈ ఊహించని సంఘటనకు వేదిక మీదున్న అందరు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఇంతలో డీజీపీ అలోక్ రాజ్ వెంటనే స్పందించారు. సీఎంకు సెల్యూట్ చేశారు. ఆ వెంటనే మైక్ వద్దకు వెళ్లారు. సీఎం ఆదేశాలను అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నామని డీజీపీ స్పష్టం చేశారు. సాధ్యమైనంత త్వరగా పోలీస్ రిక్రూట్‌మెంట్ పూర్తి చేసి.. వారికి శిక్షణ అందిస్తామని ఆయన వెల్లడించారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Also Read: Konaseema: కోనసీమ జిల్లాలో పాస్టర్ ఘరానా మోసం


kumar.jpg

అయితే సీఎం నీతీశ్ కుమార్ ఇప్పుడే కాదు.. ఈ ఏడాది జులైలో బిహార్‌లో ఓ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆ సమయంలో ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలంటూ ఓ ప్రైవేటు కంపెనీ ప్రతినిధికి సీఎం నీతీశ్‌ కుమార్‌ విజ్ఞప్తి చేశారు. అందుకోసం అవసరమైతే ఆయన పాదాలకు నమస్కరిస్తానంటూ సదరు ఇంజనీర్ వద్దకు వెళ్లారు. అంతలో ఇంజనీర్ ముందకు వచ్చి సీఎం నీతీశ్‌కు త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. దీనితో అక్కడున్నవారంతా ఒక్కసారిగా అవాక్కు అయిన విషయం విధితమే.

Also Read: Pawan Kalyan: ఉత్తరాంధ్రలో బాధితులను పరామర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్


modi.jpg

ఇక ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికలు పూర్తి అయినాయి. అనంతరం న్యూఢిల్లీలో బీజేపీ తన భాగస్వామ్య పక్షాలతో పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించింది. ఈ సందర్బంగా ప్రధాని మోదీ కాళ్లకు సీఎం నీతీశ్ కుమార్ నమస్కరించేందుకు ప్రయత్నించారు. అయితే నీతీశ్ ప్రయత్నాన్ని నరేంద్ర మోదీ వారించారు. ఇక సీఎం నీతీశ్ కుమార్‌ వివిధ సందర్భాల్లో ఈ విధంగా వ్యవహరించిన ఈ మూడు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read: Telangana MLA: తిరుమలలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు


మరోవైపు వచ్చే ఏడాది బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయంటూ ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. అలాంటి వేళ.. పోలీస్ రిక్రూట్‌మెంట్ నిర్వహించాలని సభా వేదిక మీద నుంచే డీజీపీకి సీఎం చేతులు జోడించి ప్రాధేయపడుతుండడం పట్ల విపక్షాలు మండిపడుతున్నాయి. ఇక ఈ వీడియోపై నెటిజన్లు సైతం తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

Also Read: సీమ చింతకాయలు తినడం వల్ల ఇన్ని లాభాలున్నాయా..?

For National News And Telugu News...

Updated Date - Oct 21 , 2024 | 07:58 PM