Share News

Ayodhya Ram Temple: శంకరాచార్యుల మధ్య భిన్నాభిప్రాయాలపై పూరీ శంకరాచార్య, బాబా రాందేవ్ క్లారిటీ..

ABN , Publish Date - Jan 13 , 2024 | 07:51 PM

అయోధ్య రామమందిరంలో ఈనెల 22న జరుగనున్న ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంపై నలుగురు శంకరాచార్యుల మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయంటూ జరుగుతున్న ప్రచారంపై పూరీ శంకరాచార్య నిశ్చలానంద సరస్వతి వివరణ ఇచ్చారు. ఆ వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని ఆయన శనివారంనాడు తెలిపారు.

Ayodhya Ram Temple: శంకరాచార్యుల మధ్య భిన్నాభిప్రాయాలపై పూరీ శంకరాచార్య, బాబా రాందేవ్ క్లారిటీ..

న్యూఢిల్లీ: అయోధ్య రామమందిరంలో ఈనెల 22న జరుగనున్న ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంపై నలుగురు శంకరాచార్యుల మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయంటూ జరుగుతున్న ప్రచారంపై పూరీ శంకరాచార్య (Puri Shankaracharya) నిశ్చలానంద సరస్వతి (Nischalananda Saraswati) వివరణ ఇచ్చారు. ఆ వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని ఆయన శనివారంనాడు తెలిపారు. శంకరాచార్యుల మధ్య ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవని, దీనిపై తాము ఏకీభవించడం లేదన్నదని పూర్తిగా అబద్ధమని చెప్పారు.


పూజ, తదితరల కార్యక్రమాల గ్రంథాల ప్రకారమే జరగాలని, విగ్రహం ఏదైనా సక్రమంగా ప్రతిష్టించబడాలని ఈ వారం మొదట్లో నిశ్చలానంద సర్వసతి అన్నారు. తాను రామాలయం ఈవెంట్‌కు వెళ్లడం లేదని చెప్పారు. ఈ నేపథ్యంలో శంకరాచార్యుల మధ్య అభిప్రాయ భేదాలున్నాయనే ప్రచారం జరిగింది. దీనిపై నిశ్చలానంద సరస్వతి శనివారం వివరణ ఇచ్చారు. శంకరాచార్యుల మధ్య ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవన్నారు.


అది నిజం కాదు: రామ్‌దేవ్ బాబా

కాగా, రామాలయ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరయ్యేందుకు నలుగురు శంకరాచార్యులు నిరాకరించారన్న వార్తలపై యోగా గురువు రామ్‌దేవ్ బాబా స్పందించారు. ''భిన్నాభిప్రాయాలు ఉండవచ్చేమో కానీ, 22న జరిగే కార్యక్రమానికి నలుగుర శంకరాచార్యులు హాజరుకారనే వార్తల్లో మాత్రం నిజం లేదు'' అని ఆయన సమాధానమిచ్చారు.

Updated Date - Jan 13 , 2024 | 07:51 PM