Share News

ఎవరు తప్పు చేసినా వదిలేది లేదు: ధర్మేంద్ర ప్రధాన్‌

ABN , Publish Date - Jun 21 , 2024 | 03:20 AM

విద్యార్ధుల భవిష్యత్తే తమకు అత్యంత ప్రాధాన్య అంశమని.. వారి ప్రయోజనాలను పరిరక్షించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ స్పష్టం చేశారు.

ఎవరు తప్పు చేసినా వదిలేది లేదు: ధర్మేంద్ర ప్రధాన్‌

న్యూఢిల్లీ, జూన్‌ 20(ఆంధ్రజ్యోతి): విద్యార్ధుల భవిష్యత్తే తమకు అత్యంత ప్రాధాన్య అంశమని.. వారి ప్రయోజనాలను పరిరక్షించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ స్పష్టం చేశారు. నీట్‌ ప్రశ్నాపత్రం లీకేజీపై గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్మాణం, పనితీరు, పారదర్శకత, డేటా సెక్యూరిటీ ప్రొటోకాల్‌ తదితర అంశాలపై క్షుణంగా విచారణ జరిపి ప్రభుత్వానికి సిఫారసులు చేసేందుకు ఒక ఉన్నతస్థాయి కమిటీని నియమిస్తామని ఆయన తెలిపారు. బిహార్‌లో నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీపై పోలీసు దర్యాప్తు జరుగుతోందని.. దానిపై త్వరలో తమకు నివేదిక అందుతుందని వెల్లడించారు. కొన్ని చోట్ల తప్పులు జరిగాయని అంగీకరించిన ఆయన.. తప్పు చేసిన వారు ఎన్‌టీఏకు చెందినవారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ఎంత పెద్దవారైనా క్షమించబోమని హెచ్చరించారు.

Updated Date - Jun 21 , 2024 | 03:20 AM