కాంగ్రెస్‌తో పొత్తుపై క్లారిటీ ఇచ్చిన మాజీ సీఎం
ABN , Publish Date - Dec 11 , 2024 | 11:54 AM
మరికొద్ది రోజుల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పొత్తుపై ఆమ్ ఆద్మీ పార్టీ స్పష్టత ఇచ్చింది. రానున్న ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే బరిలో నిలుస్తుందని ఆ పార్టీ స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ, డిసెంబర్ 11: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది రోజుల్లో నగారా మోగనుంది. అలాంటి వేళ.. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. రానున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే బరిలో దిగుతోందని ఆప్ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఆప్.. తన సొంత బలంతోనే ఈ ఎన్నికల్లో పోరాడనుందని ఆయన వెల్లడించారు.
Also Read : పార్లమెంట్ సమావేశాలు.. నోటీసులు ఇచ్చిన ఎంపీలు..
కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం లేదని ఆయన కుండ బద్దలు కొట్టారు. ఈ మేరకు బుధవారం ఎక్స్ ఖాతా వేదికగా ఎన్నికల పొత్తపై మాజీ సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. అయితే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌తో కలిసి కాంగ్రెస్ పార్టీ వెళ్తుందంటూ ఓ ప్రచారం అయితే జోరుగా సాగుతోంది.
Also Read: ఆందోళనకు దిగిన బీజేపీ ఎమ్మెల్యేలు
అందుకోసం ఇరు పార్టీలు అగ్రనేతలు చర్చలు జరుపుతోన్నారని.. దీంతో15 సీట్లు కాంగ్రెస్ పార్టీకి కేటాయించడంపై చర్చ నడుస్తోందనే ప్రచారం సాగుతోంది. కానీ తాజాగా మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎక్స్ వేదికగా చేసిన ప్రకటనతో కాంగ్రెస్ పార్టీతో ఆప్‌కు పొత్తు పెట్టుకోవడం లేదనే విషయం స్పష్టమైంది. ఈ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులకు సంబంధించిన రెండు జాబితాలను ఇప్పటికే ఆప్ విడుదల చేసిన విషయం విధితమే. దీంతో 39 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.
Also Read: హిందువులపై దాడులు.. స్పందించిన బంగ్లాదేశ్
70 అసెంబ్లీ స్థానాలున్నా.. ఢిల్లీ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో వరుసగా మరోసారి సత్తా చాటాలని ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ వ్యూహాత్మంగా అడుగులు వేస్తున్నారు. అయితే న్యూఢిల్లీ వేదికగా పాలన సాగిస్తున్న ఆప్‌కు గండి కోట్టాలని బీజేపీ భావిస్తుంది. ఆ క్రమంలో కమలనాథులు.. తమదైన శైలిలో ప్రణాళికలు సిద్దం చేసుకొని ముందుకు సాగుతోన్నారు. ఇక రెండో జాబితాలో 13 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు చోటు దక్కక పోవడం గమనార్హం.
అలాగే పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేల సీట్లను సైతం ఈ సారి మార్చింది. దీంతో మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా.. ఈసారి పట్పర్ గంజ్ నుంచి కాకుండా.. జంగ్‌పుర నుంచి బరిలో నిలవనున్నారు. ఇంకోవైపు ఆప్‌కు చెందిన పలువురు కీలక నేతలు.. ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరుకున్నారు.
అయితే ఈ ఏడాది మే జూన్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీ మహానగరంలోని మొత్తం లోక్ సభ స్థానాల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం విధితమే. మరి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రజలు కడతారనేది తెలియాలంటే.. 2025, ఫిబ్రవరి వరకు ఆగాల్సిందేనన్నది సుస్పష్టం.
For National News And Telugu News