Share News

Omar Abdullah: ప్రజలను లాఠీలతో బెదిరించొద్దు...సీఎం తొలి ఆదేశం

ABN , Publish Date - Oct 16 , 2024 | 07:08 PM

జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా బుధవారంనాడు ప్రమాణస్వీకారం చేసిన కొద్ది సేపటికే పోలీసులకు తొలి ఆదేశాలిచ్చారు.

Omar Abdullah: ప్రజలను లాఠీలతో బెదిరించొద్దు...సీఎం తొలి ఆదేశం

శ్రీనగర్: జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) బుధవారంనాడు ప్రమాణస్వీకారం చేసిన కొద్ది సేపటికే పోలీసులకు తొలి ఆదేశాలిచ్చారు. వీఐపీల పర్యటన సమయంలో రోడ్లపై ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని, లాఠీలు చూపించడం (Stick-waving), దురుసుగా ప్రవర్తించడం చేయరాదని ఆదేశించారు. సీఎంగా తన రాకపోకల కోసం గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్' వేదికగా ఒక పోస్ట్ చేశారు.

Maharashtra polls: సీఎం ఎవరో సంకేతాలిచ్చిన దేవేంద్ర ఫడ్నవిస్


''జమ్మూకశ్మీర్ డీజీపీతో ఫోనులో మాట్లాడాను. వీఐపీల రాకపోకల సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలకరాదని చెప్పాను. లాఠీలు ఝళిపించడం, దురుసుగా ప్రవర్తించడం చేయవద్దని ఆదేశాలిచ్చాను. మన ప్రవర్తన పీపీల్స్-ఫ్రెండ్రీగా ఉండాలని నా మంత్రివర్గ సహచరులకు కూడా సూచించాను. ప్రజాసేవ కోసమే పదవుల్లో ఉన్నాం, వారికి అసౌకర్యం కలిగించడానికి కాదని చెప్పాను'' అని ఒమర్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.


జమ్మూకశ్మీర్ కొత్త ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా బుధవారం ఉదయం 11.30 గంటలకు శ్రీనగర్‌లోని షెరి కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రమాణస్వీకారం చేశారు. ఐదుగురిని తన క్యాబినెట్‌లోకి తీసుకున్నారు. వీరిలో నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి నలుగురు, ఒక స్వతంత్ర అభ్యర్థి ఉన్నారు. ఎన్‌సీతో కూటమిగా ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ నూతన ప్రభుత్వంలో చేరడం లేదని, బయట నుంచి మద్దతిస్తామని తెలిపింది.


For National News And Telugu News..

ఇది కూడా చదవండి..

Jammu and Kashmir: కాంగ్రెస్ సంచలన నిర్ణయం.. వారికి బయట నుంచే మద్దతు..

DA Hike: మోదీ దీపావళి గిఫ్ట్.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం డీఏ పెంపు

Updated Date - Oct 16 , 2024 | 07:08 PM