Ganesh Chaturthi: ఈ వినాయకుడికి మటన్, చికెన్‌తో ప్రసాదం..!
ABN , Publish Date - Sep 09 , 2024 | 10:16 AM
శ్రావణమాసం అంతా నాన్ వెజ్ తినకుండా ఉంటారు. వినాయక చతుర్థితి వచ్చిందంటే చాలు.. నాన్‌వెజ్‌తో పండుగ చేస్తారు. వినాయకుడికి సైతం నాన్‌వెజ్ వంటకాలను నైవేద్యంగా సమర్పిస్తారు. కొత్తగా పెళ్లైన కూతురు, అల్లుళ్లను ఇంటికి ఆహ్వానించి పెద్ద ఎత్తున పార్టీ చేసుకుంటారు. ఈ విచిత్ర ఆచారం ఎక్కడుంది? వారు ఎందుకిలా చేస్తారు? అనే వివరాలు తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే..
గడగ్, సెప్టెంబర్ 09: దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంబరాన్నంటాయి. నియమ నిష్టలతో ఆ గణనాథుడిని భక్తులు పూజిస్తున్నారు. భక్తులు కోరిన కోరికలు తీర్చే బొజ్జ గణపయ్యకు ఇష్టమైన ప్రసాదాలు సమర్పిస్తున్నారు. సాధారణంగా మోదక నైవేద్యం అంటే వినాయకుడికి చాలా ఇష్టం. అందుకే ఆ లంభోదరుడికి మోదక నైవేద్యం అర్పిస్తుంటారు. అయితే, కొందరు ప్రజలు మాత్రం.. గణనాథుడికి నాన్ వెజ్‌ని నైవేద్యంగా సమర్పిస్తారు. మటన్, చికెన్‌తో రకరకాల వంటకాలు చేసి వినయాకుడికి నైవద్యేంగా పెడతారు.
ఈ ప్రత్యేక ఆచారం.. కర్ణాటక రాష్ట్రంలోని గడగ్ నగరం కనాతోట్ ఓనికి చెందిన పరశురామస పవర, నారాయణస పవర కుటుంబాల్లో ఉంది. గణేష్ చతుర్థినాడు.. ఎస్ఎస్‌కే సొసైటీలో నివాసముంటున్న ఈ కుటుంబాలు.. వినాయకుడిని ప్రతిష్టించి.. నైవేద్యంగా మాంసాన్ని సమర్పిస్తారు. ఇక రెండో రోజు ఎలుకల పండుగ నిర్వహిస్తారు. తరతరాలుగా ఈ ఆచారం ఉందని సదరు భక్తులు చెబుతున్నారు. మహిళలు ఉదయాన్నే లేచి.. మటన్, చికెన్‌తో వివిధ రకాల వంటకాలు చేసి.. నైవేద్యంగా సమర్పించి ప్రత్యేక పూజలు చేస్తారు.
వాస్తవానికి శ్రావణ మాసం ప్రారంభం కాకముందే ఈ కుటుంబాలు నాన్‌వెజ్‌కు దూరంగా ఉంటారు. శ్రావణ మాసం మొత్తం మాంసాహారం తినకుండా ఉంటారు. గణేష్ చతుర్థి నాడు వినాయకుడికి మోదక లడ్డూలు సహా వివిధ పలహారాలు సమర్పిస్తారు. మరుసటి రోజు ఎలుకల పండుగ నిర్వహిస్తారు. ఎలుకలను పూజిస్తారు. మూషికానికి పంచ ఫలారాలు అర్పిస్తారు. అనంతరం గణేషుడికి మాంసాహారం సమర్పిస్తారు. తద్వారా నెల రోజుల శ్రావణ మాస వ్రతాన్ని విమరమిస్తారు. శతాబ్దాలుగా వస్తోన్న ఈ ఆచారాన్ని తాముకూడా పాటిస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు.
మటన్ కైమాతో సహా వివిధ రకాల నాన్ వెజ్ ఐటమ్స్ ఈరోజు ఇంట్లోనే తయారుచేస్తారు. సందు అంతా సందడిగా ఉంది. వంట చేసిన తర్వాత, అన్ని రకాల నాన్ వెజ్ ఖ్యాద్యాలను గణేశుడికి నైవేద్యంగా పెడతారు. ఇంట్లోని వారందరూ ఒకచోట చేరి వినాయకుడికి మంగళారతి చేస్తారు. శతాబ్దాలుగా మన పెద్దలు ఆచరిస్తున్న ఆచారాన్ని మనం చేస్తున్నామని పెద్దలు చెబుతారు. అంతేకాదు.. ఈ రోజున కొత్తగా పెళ్లయిన కూతురు, అల్లుడిని ఇంటికి పిలిపించుకుని కుటుంబ సభ్యులు కలిసి కూర్చుని రకరకాల నాన్ వెజ్ వంటకాలను ఆస్వాదిస్తారు.