Share News

Omar Abdullah: మీ అభ్యర్థులను పోటీకి దింపొద్దు.. పీడీపీ 'ఆఫర్'కు ఒమర్ కౌంటర్

ABN , Publish Date - Aug 25 , 2024 | 08:56 PM

తమ ఎన్నికల మేనిఫెస్టోకు అంగీకారం తెలిపితే కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్‌ కూటమిపై తమ అభ్యర్థులెవరినీ పోటీకి దింపమని, తాను కూడా పోటీ చేయనని పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్షురాలు మెమబూబా ముఫ్తీ చేసిన ప్రతిపాదనపై నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ఆదివారంనాడు స్పందించారు. రెండు పార్టీల ఎజెండాలు ఒకటేనని, తమ కూటమి అభ్యర్థులపై పీడీపీ పోటీకి దూరంగా ఉంటే సరిపోతుందని అన్నారు.

Omar Abdullah: మీ అభ్యర్థులను పోటీకి దింపొద్దు.. పీడీపీ 'ఆఫర్'కు ఒమర్ కౌంటర్

శ్రీనగర్: తమ ఎన్నికల మేనిఫెస్టోకు అంగీకారం తెలిపితే కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్‌ (Congress-National conference) కూటమిపై తమ అభ్యర్థులెవరినీ పోటీకి దింపమని, తాను కూడా పోటీ చేయనని పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ (PDP) అధ్యక్షురాలు మెమబూబా ముఫ్తీ (Mehbooba Mufti) చేసిన ప్రతిపాదనపై నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) ఆదివారంనాడు స్పందించారు. రెండు పార్టీల (పీడీపీ, ఎన్‌సీ) ఎజెండాలు ఒకటేనని, కాంగ్రెస్-ఎన్‌సీ అభ్యర్థులపై పీడీపీ తమ అభ్యర్థులను నిలపరాదని సూచించారు.

J&K Elections: ఒమర్ అబ్దుల్లా యూటర్న్.. పోటీలో ఉంటానని ప్రకటన..


''తమ ఎజెండాను అంగీకరిస్తే ఎన్‌సీ-కాంగ్రెస్ కూటమిపై అభ్యర్థులను నిలపమని పీడీపీ చెబుతోంది. అయితే మా ఎజెండాలోని అన్ని అంశాలను మీరు మీ ఎజెండాలో చేర్చారు. మీరు ఇప్పటికే మా ఎజెండాను అంగీకరించారు. ఇప్పుడు మీ ఎజెండా, మా ఎజెండా మధ్య పెద్ద తేడా ఏమీ లేదు. మీరు మీ అభ్యర్థులను పోటీకి దింపకుంటే సరిపోతుంది. మనం కలిసికట్టుగా రేపటి మెరుగైన జమ్మూకశ్మీర్‌ను నిర్మిద్దాం'' అని ఒమర్ పేర్కొన్నారు. 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్, ఏడాదిలో లక్ష ప్రభుత్వ ఉద్యోగాల కల్పన అనేవి రెండు మేనిఫెస్టోలలోనూ ఉన్నాయని ఆయన చెప్పారు. రీఓపినింగ్ రూట్స్ (క్రాస్-ఎల్ఓసీ) గురించి నేషనల్ కాన్ఫరెన్స్ ఎజెండాలో చెప్పడం జరిగిందని, చర్చలకు ద్వారాలు తెరిచే ఉంటాయని చెప్పామని, అవే పీడీపీ మేనిఫెస్టోలోనూ చోటుచేసుకున్నాయని అన్నారు. ఎన్‌సీ-కాంగ్రెస్ అభ్యర్థులపై పీడీపీ పోటీకి దిగకుంటే సరిపోతుందని చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 25 , 2024 | 08:56 PM