Share News

Jammu Kashmir :16న సీఎంగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం..!

ABN , Publish Date - Oct 13 , 2024 | 01:18 PM

జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రిగా నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహుర్తం ఖరారు అయినట్లు సమాచారం. అక్టోబర్ 16వ తేదీన ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా బాధ్యతలు చేపట్టనున్నారని సమాచారం. అయితే శుక్రవారం సీఎం అభ్యర్థి ఒమర్ అబ్దుల్లా విలేకర్లతో మాట్లాడుతూ.. గత ఆరేళ్లుగా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమల్లో ఉందని గుర్తు చేశారు.

Jammu Kashmir :16న సీఎంగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం..!

శ్రీనగర్, అక్టోబర్ 13: జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రిగా నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహుర్తం ఖరారు అయినట్లు సమాచారం. అక్టోబర్ 16వ తేదీన ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా బాధ్యతలు చేపట్టనున్నారని సమాచారం. అయితే శుక్రవారం సీఎం అభ్యర్థి ఒమర్ అబ్దుల్లా విలేకర్లతో మాట్లాడుతూ.. గత ఆరేళ్లుగా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమల్లో ఉందని గుర్తు చేశారు. దీనికి ముగింపు పలికేందుకు కేబినెట్ నోట్ తయారు చేయాల్సి ఉందన్నారు. ఈ నోట్‌ను రాష్ట్రపతి భవన్‌తోపాటు కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు సైతం పంపిస్తామన్నారు. అందుకు సంబంధించిన ప్రక్రియా సోమవారం పూర్తవుతుందని తెలిపారు.

Maharashtra: మాజీ మంత్రి బాబా సిద్దిఖీ దారుణ హత్య.. స్పందించిన రాహుల్ గాంధీ


అనంతరం సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు చర్యలు చేపడతామన్నారు. అన్ని సవ్యంగా జరిగితే బుధవారం అంటే అక్టోబర్ 16వ తేదీన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతానని ఆయన తెలిపారు. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్న జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి ఇటీవల మూడు విడతలుగా ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 8వ తేదీన వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్‌ కూటమిలో ఆ రాష్ట్ర ఓటరు పట్టం కట్టారు.

Also Read: కూతురుని చంపాలనుకున్న తల్లి.. మైండ్ బ్లాంక్ ట్విస్ట్ ఇచ్చిన లవర్..

Also Read: ఏపీకి భారీ వర్ష సూచన.. హెల్ప్ లైన్ నెంబర్లు విడుదల


నేషనల్ కాన్ఫరెన్స్ కూటమికి 42 స్థానాలు, కాంగ్రెస్ పార్టీకి 6 గెలుచుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు తమను అనుమతించాలంటూ శుక్రవారం సాయంత్రం జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌ మనోజ్ సిన్హాను సీఎం అభ్యర్థి ఒమర్ అబ్దుల్లా భేటీ వెల్లడించారు. అలాగే తమతోపాటు సీపీఐ(ఎం), ఆప్, స్వతంత్ర్య అభ్యర్థులు సైతం తమ వెంట ఉన్నారని ఎల్జీకి ఒమర్ అబ్దుల్లా వివరించారు.

Also Read: మునక్కాయతో ఇన్ని ప్రయోజనాలున్నాయా..?

Also Read : అందుకే బాబా సిద్ధిఖీని హత్య చేశారా?


2009 నుంచి 2014 వరకు ఒమర్ అబ్దుల్లా జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రిగా పని చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు. ఇక 2019లో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసింది. దీంతో దాదాపు దశాబ్దం అనంతరం ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆర్టికల్ 370 రద్దు అనంతరం జరిగిన తొలి ఎన్నికలు ఇవి. దాంతో ఆ రాష్ట్ర ఓటరు నేషనల్ కాన్ఫరెన్స్‌ కూటమికి ఓటు వేసి మద్దతుగా నిలిచారు.

Read More National News and Latest Telugu News

Updated Date - Oct 13 , 2024 | 01:21 PM