Share News

Congress: వన్ నేషన్ - వన్ ఎలక్షన్‌ రాజ్యాంగ విరుద్ధం.. కమిటీకి రాసిన లేఖలో ఖర్గే

ABN , Publish Date - Jan 19 , 2024 | 03:44 PM

ఒకే దేశం - ఒకే ఎన్నిక(One Nation - One Election) పేరుతో బీజేపీ(BJP) రాజ్యాంగ ప్రాథమిక హక్కులను కాలరాస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) విమర్శించారు.

Congress: వన్ నేషన్ - వన్ ఎలక్షన్‌ రాజ్యాంగ విరుద్ధం.. కమిటీకి రాసిన లేఖలో ఖర్గే

ఢిల్లీ: ఒకే దేశం - ఒకే ఎన్నిక(One Nation - One Election) పేరుతో బీజేపీ(BJP) రాజ్యాంగ ప్రాథమిక హక్కులను కాలరాస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) విమర్శించారు. వన్ నేషన్ - వన్ ఎలక్షన్ ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ఆయన అత్యున్నత స్థాయి కమిటీ కార్యదర్శి నితేన్ చంద్రకు శుక్రవారం లేఖ రాశారు. రాజ్యాంగ స్ఫూర్థికి, ఫెడరలిజానికి విరుద్ధంగా ఈ విధానం ఉందని.. దీనిని కాంగ్రెస్ పూర్తిగా వ్యతిరేకిస్తుందని లేఖలో పేర్కొన్నారు.

కమిటీలో వివిధ రాష్ట్రాల్లోని ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు చోటు కల్పించలేదని.. ఈ విషయంలో పక్షపాతధోరణి అవలంబించారని ఆరోపించారు. వన్ ఎలక్షన్ అనే ఆలోచనను ఉన్నత స్థాయి కమిటీ ఇప్పటికైనా విరమించుకోవాలని.. దీనికి సంబంధించి ఏర్పాటైన హైపవర్ కమిటీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఒకే ఎన్నిక విధానం గొడ్డలిపెట్టులా మారుతుందని అభిప్రాయపడ్డారు. బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని విమర్శించారు. ఒకే ఎన్నికలంటూ బీజేపీ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రయత్నిస్తోందని ఖర్గే ఆరోపించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jan 19 , 2024 | 03:44 PM