Share News

Manipur: మణిపుర్ లో మరోసారి చెలరేగిన హింస.. ప్రభుత్వ ఆస్తులపై దాడి.. ఒకరు మృతి

ABN , Publish Date - Feb 16 , 2024 | 12:48 PM

అల్లర్లతో అట్టుడికిపోయిన మణిపుర్ లో మరోసారి హింస చెలరేగింది. చురచంద్‌పూర్‌లో గురువారం రాత్రి కొందరు దుండగలు ప్రభుత్వ కార్యాలయంలోకి చొరబడ్డారు. వాహనాలను తగలబెట్టి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు.

Manipur: మణిపుర్ లో మరోసారి చెలరేగిన హింస.. ప్రభుత్వ ఆస్తులపై దాడి.. ఒకరు మృతి

అల్లర్లతో అట్టుడికిపోయిన మణిపుర్ లో మరోసారి హింస చెలరేగింది. చురచంద్‌పూర్‌లో గురువారం రాత్రి కొందరు దుండగలు ప్రభుత్వ కార్యాలయంలోకి చొరబడ్డారు. వాహనాలను తగలబెట్టి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. వందలాది మంది ఆందోళనకారులు ఒక్కసారిగా ఆఫీస్ లోకి ప్రవేశించి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, భద్రతా దళాలు ఉపయోగించే అనేక బస్సులు, ట్రక్కులను తగులబెట్టారు. ఈ ఘర్షణల్లో ఒకరు చనిపోగా 30 మందికి గాయాలయ్యాయని ఓ అధికారి తెలిపారు. విషయం తెలుసుకున్న భద్రతా బలగాలు స్పాట్ కు చేరుకున్నాయి. ఆందోళనను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.

చురాచంద్‌పూర్ జిల్లాకు చెందిన ఓ పోలీస్ కానిస్టేబుల్ మారణాయుధాలతో కనిపించడం తీవ్ర కలకలం సృష్టించింది. ఇందుకు సంబంధించిన వీడియోలో అతను సాయుధ వ్యక్తులతో కలిసి ఉన్న వీడియో వైరల్ అయ్యింది. దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికారులు సదరు కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశారు. ముందస్తు అనుమతి లేకుండా స్టేషన్ వదిలి వెళ్ళవద్దని ఆదేశించారు. దీంతో స్థానికులు తీవ్ర ఆగ్రహంతో దాడి చేసి వాహనాలు ధ్వంసం చేశారు. ఈ ఘటనకు ఎస్పీ శివానంద్ సర్వే బాధ్యత వహించాలని ఆదివాసీ గిరిజన నాయకుల ఫోరం (ఐటీఎల్‌ఎఫ్) డిమాండ్ చేస్తోంది.


కాగా.. గతేడాది మణిపుర్ లో ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించిన ఘటన దేశవ్యాప్తంగా పెను తుపాను సృష్టించింది. కుకీ తెగ‌కు చెందిన మ‌హిళ‌ల్ని.. మైతేయకు చెందిన వ్యక్తులు న‌గ్నంగా ఊరేగించారు. కంగ్‌పోప్కీ జిల్లాలో మే 4వ తేదీన ఈ ఘ‌ట‌న జ‌రిగింది. మ‌హిళ‌ల్ని న‌గ్నంగా ఊరేగించిన ఘటనను అధికారులు సుమోటోగా తీసుకున్నారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లి్క్ చేయండి.

Updated Date - Feb 16 , 2024 | 12:48 PM