Share News

West bengal: సీట్ల షేరింగ్‌పై మమత పార్టీ మడత పేచీ..!

ABN , Publish Date - Jan 06 , 2024 | 05:10 PM

పశ్చిమబెంగాల్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో సీట్ల షేరింగ్ వ్యవహారంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారథ్యంలో టీఎంసీ మరోసారి పార్టీ వైఖరిని స్పష్టం చేసింది. 'ఓపెన్ హార్ట్'తో కాంగ్రెస్‌తో మాట్లాడేందుకు సిద్ధమేనని, చర్చలు విఫలమైతే మాత్రం ఒంటిరిగా పోటీ చేసేందుకు కూడా సిద్ధమని తెలిపింది.

West bengal: సీట్ల షేరింగ్‌పై మమత పార్టీ మడత పేచీ..!

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ (West Bengal) నుంచి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో సీట్ల షేరింగ్ వ్యవహారంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) సారథ్యంలో టీఎంసీ మరోసారి పార్టీ వైఖరిని స్పష్టం చేసింది. 'ఓపెన్ హార్ట్'తో కాంగ్రెస్‌తో మాట్లాడేందుకు సిద్ధమేనని, చర్చలు విఫలమైతే మాత్రం ఒంటిరిగా పోటీ చేసేందుకు కూడా సిద్ధమని తెలిపింది.


లోక్‌సభలో టీఎంసీ నేత సుదీప్ బందోపాధ్యాయ్ శనివారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ, పశ్చిమబెంగాల్‌లో కాంగ్రెస్‌తో సీట్ల షేరింగ్ వ్యవహారంపై ఓపెన్ హార్ట్‌తో ఉన్నామని మమతా బెనర్జీ ఇప్పటికే చెప్పినట్టు తెలిపారు. బెంగాల్‌లో సీట్ల పంపిణీ వ్యవహారంపై సోనియాగాంధీ, మమతా బెనర్జీ ఏ నిర్ణయం తీసుకుంటారనేది చూడాలని, కాంగ్రెస్ నేతలు ఏమనుకుంటున్నారనేది ప్రధానం కాదని చెప్పారు. టీఎంసీని సీట్లు అడుక్కోమంటూ పశ్చిమబెంగాల్ రాష్ట్ర అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదర్ రెండ్రోజుల క్రితం వ్యాఖ్యానించిన నేపథ్యంలో బందోపాధ్యాయ్ తాజా వివరణ ఇచ్చారు. కాగా, పశ్చిమబెంగాల్‌లో కాంగ్రెస్‌తో పొత్తుకు టీఎంసీ సుముఖంగానే ఉందని, అవసరమైతే సోలోగా పోటీకి కూడా రెడీ సిద్ధంగా ఉందని పేరు వెల్లడించడానికి ఇష్టపడని మరో టీఎంసీ సీనియర్ నేత వెల్లడించారు.


కాంగ్రెస్‌కు 4 సీట్లు...

కాగా, పశ్చిమబెంగాల్‌లోని 42 లోక్‌సభ స్థానాల్లో 4 స్థానాలను కాంగ్రెస్‌కు విడిచిపెట్టాలని టీఎంసీ ఆలోచనగా చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో టీఎంసీ 22 సీట్లు, బీజేపీ 2 సీట్లు, బీజేపీ 18 సీట్లు గెలుచుకున్నాయి. లోక్‌సభ నేతగా ఉన్న అధీర్ రంజన్ చౌదరి ముర్షీదా బాద్ జిల్లా బహరాంపూర్ సీటుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి హసెం ఖాన్ చౌదరి మాల్దా జిల్లాలోని మాల్దహ దక్షిణ్ సీటు నుంచి వరుసగా మూడు సారి గెలిచారు. టీఎంసీ గతంలో 2002 అసెంబ్లీ ఎన్నికలు, 2009 లోక్‌సభ ఎన్నికలు, 2011 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంది.

Updated Date - Jan 06 , 2024 | 05:13 PM