Share News

Mumbai: ముఖేశ్ అంబానీ ఫ్యామిలీ ప్రాణాలు కాపాడిన ‘ఆస్కార్’

ABN , Publish Date - Oct 24 , 2024 | 08:18 PM

ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ నివాసం యాంటిలియా సమీపంలో కారులో పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించింది ఆస్కార్ జాగిలమే. ఈ జాగిలం బుధవారం రిటైర్ అయింది. దీనితోపాటు దాని సహద్యోగి మైలో సైతం రిటైర్ అయింది. ఈ సందర్భంగా ముంబయిలో ఫేర్‌వెల్ ఫంక్షన్ పోలీసులు చాలా గ్రాండ్‌గా నిర్వహించారు.

Mumbai: ముఖేశ్ అంబానీ ఫ్యామిలీ ప్రాణాలు కాపాడిన ‘ఆస్కార్’

ముంబయి, అక్టోబర్ 24: ఈ భూ మండలం మీద విశ్వాసం గల జీవి ఏదంటే.. ఎవరైనా చెప్పే పేరు కుక్క. విశ్వాసానికే కాదు.. మనుషుల ప్రాణాలను కాపాడడంలో సైతం కుక్కలు లేదా జాగిలాలు కీలక పాత్ర పోషిస్తాయన్న సంగతి అందరికి తెలిసిందే. వీఐపీలు, వీవీఐపీల పర్యటనలు సందర్భంగా లేదా ఎప్పుడైనా.. ఎక్కడైనా.. బాంబు బెదిరింపులు వచ్చినప్పుడు ముందుగా వాటిని పసిగట్టేది ఈ జాగిలాలే. విశ్వాసం గల జీవి ఈ భూమండలం మీద ఏదైనా ఉందంటే అది ఒక్క జాగిలమే.

Also Read:TamilNadu: రోడ్డుపైకి భారీగా చేరిన నురగ.. ఎందుకంటే..


ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ నివాసం యాంటిలియా సమీపంలో కారులో జిలెటిన్ స్టిక్స్ ఉన్నట్లు గుర్తించింది కూడా ఒక జాగిలమే. ఆ జాగిలం పేరు ఆస్కార్. ఈ జాగిలం బుధవారం రిటైర్ అయింది. దీనితోపాటు మరో సహద్యోగి మైలో జాగిలం సైతం రిటైర్ అయింది. ఈ సందర్భంగా ఫేర్‌వెల్ ఫంక్షన్ పోలీసులు చాలా గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ఫేర్ వెల్ ఫంక్షన్‌కు పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు సైతం హాజరయ్యారు.

Also Read: TS Politics: గాదరి కిషోర్‌పై మందుల సామేల్ విసుర్లు


2014లో ముంబయి పోలీస్ శాఖలో బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్‌(బీడీడీఎస్)లో ఆస్కార్, మైలో జాయిన్ అయ్యాయని పోలీసులు గుర్తు చేసుకున్నారు. 2021, ఫిబ్రవరి 25న ముఖేశ్ అంబానీ నివాసానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఆ సమయంలో ఈ జాగిలం ఆస్కార్ కీలక పాత్ర పోషించిందని పోలీస్ ఉన్నతాధికారులు ఈ సందర్భంగా వివరించారు. ఆ సమయంలో ముఖేశ్ అంబానీ నివాసం సమీపంలోని ఎస్‌యూవీ కారులో పేలుడు పదార్ధాలు ఉన్నట్లు పసిగట్టింది ఈ ఆస్కారేనన్నారు.

Also Read: Ram Mohan Naidu: ఇది చారిత్రాత్మకమైన రోజు


ఈ పదేళ్లలో పోలీస్ శాఖకే కాదు.. ప్రజలకు సైతం ఈ జాగిలాల సేవలు ఎలా ఉపయోగపడ్డాయో పలువురు ఉన్నతాధికారులు ఈ సందర్భంగా సోదాహరణగా వివరించారు. ఈ జాగిలాల సేవలకు కృతజ్ఞతగా.. రెండు కుక్కలు ఉండేందుకు షెల్టర్ హోమ్‌లో ఎయిర్ కండిషనింగ్ ఏర్పాటు చేశామన్నారు. అలాగే వాటి రవాణా కోసం వినియోగించే వాహనానికి AC సదుపాయాన్ని సైతం ఏర్పాటు చేశామని చెప్పారు. ఇక ఆస్కార్‌తో పాటు రిటైర్ అయిన మైలో సేవలను సైతం పోలీస్ అధికారులు ప్రశంసలతో ముంచెత్తారు.

For National news And Telugu News

Updated Date - Oct 24 , 2024 | 08:18 PM