Share News

Lok Sabha Speaker Election: లోక్‌సభ స్పీకర్ పదవి ఎన్నికల్లో ఎన్‌డీఏ అభ్యర్థి ఓం బిర్లా గ్రాండ్ విక్టరీ

ABN , Publish Date - Jun 26 , 2024 | 10:59 AM

18వ లోక్‌సభ స్పీకర్ పదవి కోసం జరిగిన ఎన్నికల్లో(Lok Sabha Speaker election) ఎన్‌డీఏ అభ్యర్థి ఓం బిర్లా(Om Birla) విజయం సాధించారు. బిర్లా కాంగ్రెస్‌కు చెందిన కె సురేష్‌తో పోటీ పడి గెలుపొందారు. ఓం బిర్లా 17వ లోక్‌సభలో స్పీకర్ పదవిని కూడా నిర్వహించారు. ఆ సమయంలో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Lok Sabha Speaker Election: లోక్‌సభ స్పీకర్ పదవి ఎన్నికల్లో ఎన్‌డీఏ అభ్యర్థి ఓం బిర్లా గ్రాండ్ విక్టరీ
Om Birla

18వ లోక్‌సభ స్పీకర్ పదవి కోసం జరిగిన ఎన్నికల్లో(Lok Sabha Speaker election) ఎన్‌డీఏ అభ్యర్థి ఓం బిర్లా(Om Birla) విజయం సాధించారు. బిర్లా కాంగ్రెస్‌కు చెందిన కె సురేష్‌తో పోటీ పడి గెలుపొందారు. లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లాను ఎన్నుకోవాలన్న ప్రతిపాదన మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. ఓం బిర్లా 17వ లోక్‌సభలో స్పీకర్ పదవిని కూడా నిర్వహించారు. ఆ సమయంలో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్డీయే మరోసారి ఆయనను అభ్యర్థిగా నిలబెట్టింది.

రాజస్థాన్‌లోని కోట బుండి స్థానం నుంచి ఆయన మూడోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. దేశ చరిత్రలో ఇప్పటి వరకు ఏ ఎంపీ కూడా వరుసగా రెండు సార్లు స్పీకర్‌గా వ్యవహరించలేదు. లోక్ సభ సంఖ్యా బలం కారణంగా ఆయన గెలుపు ఖాయమైంది.


అంతకుముందు సభ కార్యకలాపాలు ప్రారంభమైన వెంటనే, ప్రధాని మోదీ సభలో లోక్‌సభ స్పీకర్ కోసం ఓం బిర్లా పేరును ప్రతిపాదించారు. దీనికి రాజ్‌నాథ్ సింగ్ సహా పలువురు మద్దతు ఇచ్చారు. లోక్‌సభలో స్పీకర్‌ పదవికి ఎన్నిక జరగడం 1976 తర్వాత ఇదే తొలిసారి. ఎన్డీయే అభ్యర్థి ఓం బిర్లాపై విపక్షాల అభ్యర్థిగా కాంగ్రెస్ సభ్యుడు కొడికునిల్ సురేశ్ పోటీ చేశారు. స్వతంత్ర భారతదేశంలో, లోక్‌సభ స్పీకర్ పదవికి 1952, 1967, 1976లో మూడుసార్లు మాత్రమే ఎన్నికలు జరిగాయి.


1952లో కాంగ్రెస్ సభ్యుడు జీవీ మావలంకర్ మొదటి లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ఈసారి లోక్‌సభ స్పీకర్ పదవి ఎంపికకు సంబంధించి ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ కారణంగా ఎన్నికలు అవసరమయ్యాయి. కేంద్రంలో ప్రధాని మోదీ నేతృత్వంలో వరుసగా మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య బలప్రదర్శన ఇదే తొలిసారి.


ఇవి కూడా చదవండి:

Lok Sabha Speaker: లోక్‌సభ స్పీకర్ ఎన్నిక కోసం నేడే ఓటింగ్..ఎవరు గెలుస్తారంటే..!

Rahul Gandhi : విపక్ష నేతగా రాహుల్‌

For Latest News and National News click here

Updated Date - Jun 26 , 2024 | 11:55 AM