Delhi crime: జీటీబీ ఆసుపత్రిలో పేషెంట్‌ను కాల్చిచంపిన ఆగంతకుడు
ABN , Publish Date - Jul 14 , 2024 | 06:51 PM
దేశ రాజధాని నగరం ఢిల్లీలోని గురు తేజ్ బహదూర్ ఆసుపత్రిలో ఘాతుకం చోటుచేసుకుంది. ఆసుపత్రిలోని 24వ వార్డులోకి ప్రవేశించిన ఒక టీనేజర్ అక్కడ చికిత్స పొందుతున్న రియాజుద్దీన్ (32) అనే వ్యక్తిని కాల్చిచంపాడు. ఆ వెంటనే పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన రియాజుద్దీన్ ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు.
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీలోని గురు తేజ్ బహదూర్ (GTB) ఆసుపత్రిలో ఆదివారంనాడు ఘాతుకం చోటుచేసుకుంది. ఆసుపత్రిలోని 24వ వార్డులోకి ప్రవేశించిన ఒక టీనేజర్ అక్కడ చికిత్స పొందుతున్న రియాజుద్దీన్ (32) అనే వ్యక్తిని కాల్చిచంపాడు. ఆ వెంటనే పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన రియాజుద్దీన్ ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు.
Armstrong: బీఎస్పీ అధ్యక్షుడి హత్య కేసులో నిందితుడు ఎన్‌కౌంటర్
వార్డులో కాల్పుల ఘటనపై జీటీబీ ఎంక్లేవ్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం రాగానే పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారని, అప్పటికే తీవ్రంగా గాయపడిన రియాజుద్దీన్ మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారని డిసీపీ సురేంద్ర చౌదరి తెలిపారు. మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో 18 ఏళ్ల యువకుడు వార్డులోకి వచ్చాడని, రియాజుద్దీన్‌పై వెంటనే కాల్పులు జరిపాడని తెలిపారు. కేసు నమోదు చేసి ఆగంతకుని పట్టుకునేందుకు పోలీసు బృందాన్ని పంపినట్టు చెప్పారు. వ్యక్తిగత కక్షలే ఈ కాల్పులకు కారణం కావచ్చని ప్రాథమికంగా అంచనాకు వచ్చామని అన్నారు. కాగా, ఢిల్లీలోని ఖజూరిలో ఉంటున్న రియాజుద్దీన్ పొత్తికడుపు ఇన్‌ఫెక్షన్‌తో జూన్ 23న ఆసుపత్రిలో చేరాడు.
For Latest News and National News