ఫోన్‌పే టపాసుల బీమా పాలసీ
ABN , Publish Date - Oct 15 , 2024 | 03:58 AM
దీపావళి పండగ సందర్భంగా బాణసంచా సంబంధిత ప్రమాదాలు జరిగితే బీమా రక్షణ కల్పించేందుకు వీలుగా డిజిటల్ చెల్లింపుల దిగ్గజం ఫోన్‌పే సరికొత్త ఫైర్‌క్రాకర్ బీమా పాలసీని తెచ్చింది.
రూ.9 ప్రీమియంతో రూ.25వేల వరకు కవరేజీ
న్యూఢిల్లీ, అక్టోబరు 14: దీపావళి పండగ సందర్భంగా బాణసంచా సంబంధిత ప్రమాదాలు జరిగితే బీమా రక్షణ కల్పించేందుకు వీలుగా డిజిటల్ చెల్లింపుల దిగ్గజం ఫోన్‌పే సరికొత్త ఫైర్‌క్రాకర్ బీమా పాలసీని తెచ్చింది. ఈ ప్లాన్ కింద వినియోగదారులు రూ.9 ప్రీమియం చెల్లించి రూ.25వేల వరకు బీమా కవరేజీని పొందవచ్చని సోమవారం కంపెనీ పేర్కొంది. ఈ నెల 25వ తేదీ నుంచి 10 రోజుల పాటు కవరేజీని పొందవచ్చని తెలిపింది. టపాసుల సంబంధిత ప్రమాదాల నుంచి ఈ పాలసీ రక్షణ కల్పిస్తుందని పేర్కొంది. ఫోన్‌పే యాప్ ద్వారా ఈ పాలసీని కొనుగోలు చేయవచ్చు. వినియోగదారుతోపాటు భాగ స్వామి, ఇద్దరు పిల్లలకు కూడా సమగ్ర కుటుంబ కవరేజీని అందిస్తోంది. అక్టోబరు 25 తర్వాత పాలసీని కొనుగోలు చేస్తే కొన్న రోజు నుంచి పాలసీ కవరేజీ ప్రారంభమవుతుందని ఫోన్‌పే పేర్కొంది. బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్‌తో కలిసి ఈ బీమా పథకాన్ని ఫోన్‌పే తీసుకొచ్చింది.