Share News

Singapore: నరేంద్ర మోదీ గారూ.. స్వాగతం

ABN , Publish Date - Sep 05 , 2024 | 05:31 AM

విదేశా ల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ బుధవారం సింగపూర్‌కు చేరుకొన్నారు. సింగపూర్‌ ప్రధాని లారెన్స్‌ వాంగ్‌ మోదీని ఘనంగా ఆహ్వానించారు.

Singapore: నరేంద్ర మోదీ గారూ.. స్వాగతం

  • ఘనంగా ఆహ్వానించిన సింగపూర్‌ ప్రధాని లారెన్స్‌ వాంగ్‌

సింగపూర్‌, సెప్టెంబరు 4: విదేశా ల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ బుధవారం సింగపూర్‌కు చేరుకొన్నారు. సింగపూర్‌ ప్రధాని లారెన్స్‌ వాంగ్‌ మోదీని ఘనంగా ఆహ్వానించారు. ప్రతిష్టాత్మక శ్రీ తెమాసెక్‌ భవనంలో ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా ‘‘నరేంద్ర మోదీ గారు.. సింగపూర్‌కు స్వాగ తం’’ అంటూ మోదీతో కలిసి ఉన్న ఫొటోను ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు. గురువారం వీరిరువురూ అధికారికంగా భేటీ కానున్నారు. ఈ సందర్భంగా పలు అవగాహనా ఒప్పందాలపై సంతకాలు చేయను న్నారు. లారెన్స్‌ వాంగ్‌ ఆహ్వానం మేరకే మోదీ సింగపూర్‌ పర్యటనకు వెళ్లారు.


ఆ దేశం నుంచి పెట్టుబడులను ఆకర్షించడం, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించడం, ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా మోదీ సింగపూర్‌లో పర్యటిస్తున్నట్లు విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రధాని హోదాలో మోదీ సింగపూర్‌లో పర్యటించడం ఇది ఐదోసారి. మరోవైపు, గురువారమే సింగపూర్‌ పార్లమెంటుహౌస్‌లో ఆ దేశ అధ్యక్షుడు షణ్ముగరత్నంను మోదీ కలుసుకోనున్నారు. సింగపూర్‌లో వ్యాపారవేత్తలతో కూడా భేటీ కానున్నారు. అంతకుముందు మోదీ బ్రూనై పర్యటనలో ఆ దేశ సుల్తాన్‌ హసనల్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని కీలక ప్రకటన చేశారు. త్వరలో రెండు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

Updated Date - Sep 05 , 2024 | 05:31 AM