PM Narendra Modi: మోదీ భూటాన్ పర్యటన వాయిదా
ABN , Publish Date - Mar 20 , 2024 | 09:27 PM
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండ్రోజుల అధికారిక భూటాన్ పర్యటన వాయిదా పడింది. భూటాన్‌లోని పారో విమానాశ్రయంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు కొనసాగుతుండటంతో పర్యటన వాయిదా పడినట్టు విదేశాంగ కార్యాలయం బుధవారంనాడు ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) రెండ్రోజుల అధికారిక భూటాన్ (Bhutan) పర్యటన వాయిదా పడింది. భూటాన్‌లోని పారో విమానాశ్రయంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు కొనసాగుతుండటంతో పర్యటన వాయిదా పడినట్టు విదేశాంగ కార్యాలయం బుధవారంనాడు ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. ''షెడ్యూల్ ప్రకారం ఈనెల 21-23 తేదీల్లో జరగాల్సిన ప్రధాన పర్యటనను వాయిదా వేయాలని ఇరుపక్షాలు నిర్ణయించుకున్నారు. తదుపరి తేదీని దౌత్య మార్గాల ద్వారా ఇరుపక్షాలు రూపొందిస్తాయి'' అని ఆ ప్రకట పేర్కొంది.
ఇండియా-భూటాన్ మధ్య ఉన్నత స్థాయిలో సంబంధాలను కొనసాగించడం, 'నైబర్‌హుడ్ ఫస్ట్ పాలసీ'కి భారత్ ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో మోదీ భూటాన్ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. ఇటీవల ఇండియాలో పర్యటించి భూటాన్ ప్రధాని షేరింగ్ టోబ్‌గే సైతం తమ దేశంలో పర్యటించాలని ప్రధాని మోదీని కోరారు. ఆ ఆహ్వానాన్ని మోదీ ఆమోదించారు. వ్యూహాత్మకంగా కూడా భారత్-చైనా సరిహద్దుల్లో ఉన్న భూటాన్ భారత్‌కు ఎంతో కీలకంగా ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.