Share News

PM Modi: బీజేపీ జాతీయ సభ్యత్వ నమోదును ప్రారంభించిన మోదీ

ABN , Publish Date - Sep 02 , 2024 | 06:11 PM

భారతీయ జనతా పార్టీ జాతీయ సభ్యత్వ నమోదు కార్యక్రమం ''సంఘటన్ పర్వ, సదస్యత అభియాన్ 2024'ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారంనాడు ప్రారంభించారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఇతర అగ్రనేతలు పాల్గొన్నారు.

PM Modi: బీజేపీ జాతీయ సభ్యత్వ నమోదును ప్రారంభించిన మోదీ

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ (BJP) జాతీయ సభ్యత్వ నమోదు (National membership drive) కార్యక్రమం ''సంఘటన్ పర్వ, సదస్యత అభియాన్ 2024'ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) సోమవారంనాడు ప్రారంభించారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఇతర అగ్రనేతలు పాల్గొన్నారు.


అత్యంత ప్రజాస్వామిక పార్టీ: అమిత్‌షా

బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ మాత్రమే కాకుండా అత్యంత ప్రజాస్వామిక పార్టీ అని ఈ సందర్భంగా అమిత్‌షా పేర్కొన్నారు. ఏ పార్టీ కూడా బీజేపీలా ఇంత పారదర్శకంగా, నిజాయితీతో సభ్యత్వ నమోదు చేసింది లేదన్నారు. జాతీయ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి హాజరైన పార్టీ కార్యకర్తలను జేపీ నడ్డా స్వాగతించారు. దేశ ప్రధాన సేవకుడిగా మోదీ బీజీ షెడ్యూల్‌‌లో కూడా ఇక్కడకు విచ్చేశారని అన్నారు. ఆయన మనందరికీ స్ఫూర్తి, రోల్ మోడల్ అని ప్రశంసించారు. సంఘటన్ పర్వ్ ఎప్పుడు జరిగినా, ఎన్నడు అవసరమున్నా తన బిజీ సమయంలో కూడా ఆయన కొంత సమయం వెచ్చిస్తుంటారని చెప్పారు. అమిత్‌షా పార్టీ జాతీయ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు కూడా సభ్యత్వ నమోదు ప్రచారానికి ప్రాధాన్యతనిచ్చే వారని గుర్తుచేశారు.


'మిస్ట్ కాల్‌'తో బీజేపీలో చేరవచ్చు..

సెప్టెంబర్ 2న సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమవుతోందని, 88 00 00 2024కు మిస్డ్ ఫోన్ కాల్‌తో సభ్యులు కావచ్చని బీజేపీ ఒక ట్వీట్‌లో తెలిపింది. పార్టీ సీనియర్ నేత అమిత్‌షా సైతం సోమవారం ఉదయం ఒక ట్వీట్‌లో బీజేపీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులకు ఈ రోజు ఎంతో కీలకమైన, శుభదినమని తెలిపారు. ప్రపంచంలోనే అతి పెద్ద, శక్తవంతమైన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రధానమంత్రి మోదీ, జేపీ నడ్డా ప్రారంభిస్తున్నారని తెలిపారు. బీజేపీ శ్రేయోభిలాషులు, పార్టీ కార్యకర్తలు, దేశవాసులంతా తిరిగి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని పార్టీని సరికొత్త శిఖరాలకు (సభ్యత్వ నమోదును) తీసుకువెళ్లాలని కోరారు.

Updated Date - Sep 02 , 2024 | 06:12 PM