Share News

BJP: అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ కీలక సమావేశం.. నిరాశజనక ఫలితాలపై దిద్దుబాటు

ABN , Publish Date - Jul 19 , 2024 | 07:36 AM

ఉత్తరప్రదేశ్‌లో(Uttarpradesh) ఉప ఎన్నికలు, మహారాష్ట్ర, హరియానా పలు రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చి బీజేపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు.

BJP: అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ కీలక సమావేశం.. నిరాశజనక ఫలితాలపై దిద్దుబాటు

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌లో(Uttarpradesh) ఉప ఎన్నికలు, మహారాష్ట్ర, హరియానా పలు రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చి బీజేపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. బీజేపీ మూడోసారి అధికారంలోకి రావడానికి నేతల కృషి ఎంతో ఉందని మోదీ కొనియాడారు. బీజేపీ ఐటీ విభాగం అధిపతి అమిత్ మాల్వియా ఎక్స్‌లో..

"ప్రధాని మోదీ మమ్మల్ని కలవడానికి బీజేపీ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. చాలా మంది పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేస్తున్నారు. పార్టీ 2 సీట్ల నుంచి 303కి ఎదగడం చూశారు. వారందరినీ మోదీ అభినందించారు. మా సేవల్ని ప్రధాని గుర్తించడం మాకు భావోద్వేగానికి గురి చేసింది" అని అమిత్ పేర్కొన్నారు. అంతకుముందు బీజేపీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న మోదీకి ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా స్వాగతం పలికారు. 2019 ఎన్నికల్లో బీజేపీ విజయం తర్వాత కూడా ఆయనే స్వాగతం పలికారు.


జాతీయాధ్యక్షుడి నియామకంపై ఫోకస్..

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉత్తరప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్యను నియమించవచ్చునని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మౌర్య యూపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కాలంలోనే 2017లో యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చిందని, పార్టీలో కింది స్థాయి నుంచి ఎదిగిన ఆయనకు అవకాశం కల్పించవచ్చని చర్చ జరుగుతోంది. మౌర్య వెనుకబడిన వర్గాలకు చెందిన నేత కావడంతో బీసీలను తమ వైపునకు తిప్పుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని బీజేపీ అగ్రనేతలు భావిస్తున్నారు.


ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షాలకు అత్యంత సన్నిహితుడైన మౌర్యను 2017లోనే యూపీ ముఖ్యమంత్రిగా నియమించాలనుకున్నప్పటికీ.. యోగీ ఆదిత్యనాథ్‌ రంగంలోకి దిగడంతో అది సాధ్యం కాలేదు. మౌర్యకూ యోగికీ పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్నట్లు విభేదాలున్నాయని, యోగి ప్రతి కదలికనూ ఆయన ఢిల్లీకి చేరవేస్తారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాగా, పార్టీ కంటే ఎవరూ గొప్పకాదని బుధవారం మౌర్య చేసిన ప్రకటన చర్చకు దారి తీసింది మంగళవారం మౌర్య ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్‌ షాలను కలిసి వెళ్లిన తర్వాత ఈ ప్రకటన చేయడంతో మౌర్య ద్వారా ఢిల్లీ నేతలు యోగికి సందేశాలు పంపినట్లు భావిస్తున్నారు. దీనికితోడు లోక్ సభ ఎన్నికల్లో ఆశాజనక ఫలితాలు రాకపోవడంపై కూడా బీజేపీ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

For Latest News and National News click here

Updated Date - Jul 19 , 2024 | 07:51 AM