Share News

PM Modi: ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగాన్ని ముక్కలు చేశారు.. కాంగ్రెస్‌పై మండిపడిన మోదీ

ABN , Publish Date - Jun 24 , 2024 | 02:21 PM

దేశంలో సరిగ్గా 50 ఏళ్ల కిందట ఎమర్జెన్సీ(Emergency in India) విధించి కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని ముక్కలు చేసిందని ప్రధాని మోదీ(PM Modi) ధ్వజమెత్తారు. 18వ లోక్ సభ సమావేశాలు ప్రారంభం అయ్యాక మోదీ ప్రసంగించారు.

PM Modi: ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగాన్ని ముక్కలు చేశారు.. కాంగ్రెస్‌పై మండిపడిన మోదీ

ఢిల్లీ: దేశంలో సరిగ్గా 50 ఏళ్ల కిందట ఎమర్జెన్సీ(Emergency in India) విధించి కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని ముక్కలు చేసిందని ప్రధాని మోదీ(PM Modi) ధ్వజమెత్తారు. 18వ లోక్ సభ సమావేశాలు ప్రారంభం అయ్యాక మోదీ ప్రసంగించారు. రాజ్యాంగాన్ని ముక్కలు చేసి, దేశాన్ని జైలుగా మార్చిన ఎమర్జెన్సీ అనే మచ్చ ఏర్పడి రేపటికి 50 ఏళ్లు అవుతుందని ప్రధాని మోదీ విమర్శించారు.

50 ఏళ్లనాటి తప్పును పునరావృతం చేసే సాహసం మున్ముందు ఎవరూ చేయకుండా దేశ ప్రజలు సంకల్పం తీసుకుంటారని అన్నారు. ప్రజలకు నినాదాలు అవసరం లేదనీ, విధానాలు కావాలని, అందుకే విపక్షం బాధ్యతాయుతంగా పని చేయాలని మోదీ కోరారు. మూడో దఫాలో మూడు రెట్లు అధికంగా పనిచేస్తామని ఎంపీలు సహకరించాలన్నారు. సామాన్య ప్రజల ఆకాంక్షలకు తగినట్లు పనిచేయాలన్నారు.


విపక్షాల నిరసనలు..

ప్రధాని మోదీ వ్యాఖ్యలపై విపక్ష ఇండియా కూటమి(INDIA Alliance) నిరసనలు తెలిపింది. రాజ్యాంగం ప్రతులను పట్టుకుని మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసింది. రాజ్యాంగాన్ని మోదీ సర్కారు కాలరాస్తోందని విపక్ష నేతలు విమర్శించారు.

రాజ్యాంగంపై ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్‌ షా దాడులు చేస్తున్నారని, ఈ దాడులు ఆమోదయోగ్యం కావని ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాలన్న తమ ప్రయత్నానికి ప్రజలు మద్దతు పలికారని కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు ఖర్గే స్పష్టం చేశారు.

For Latest News and National News click here

Updated Date - Jun 24 , 2024 | 02:21 PM