Share News

Digvijaya Singh: హిందూ - ముస్లిం వివాదంపైనే ‘మోదీ రాజకీయం’

ABN , Publish Date - May 05 , 2024 | 05:19 PM

హిందూ - ముస్లిం వివాదంపై మోదీ రాజకీయ చరిత్ర ఆధారపడి ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. అయితే ఈ అంశం వల్ల ఎవరు ప్రయోజనం పొందుతున్నారో ఆత్మ పరిశీలన చేసుకోవాలంటూ ఈ సందర్బంగా మోదీకి ఆయన సూచించారు.

Digvijaya Singh: హిందూ - ముస్లిం వివాదంపైనే ‘మోదీ రాజకీయం’
Digvijaya Singh

భోపాల్, మే 05: హిందూ - ముస్లిం వివాదంపై మోదీ రాజకీయ చరిత్ర ఆధారపడి ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. అయితే ఈ అంశం వల్ల ఎవరు ప్రయోజనం పొందుతున్నారో ఆత్మ పరిశీలన చేసుకోవాలంటూ ఈ సందర్బంగా మోదీకి ఆయన సూచించారు.

PrajaGalam: ధర్మవరం వేదికగా పోలవరంపై అమిత్ షా కీలక ప్రకటన

మధ్యప్రదేశ్‌లోని రాజ్‌ఘర్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆయన బరిలో దిగారు. ఆ క్రమంలో రాజ్‌ఘర్ లోకసభ పరిధిలో ఆదివారం దిగ్విజయ్ సింగ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ అసలు సమస్యలు గాలికి వదిలి.. కులం, మతం ఆధారంగా ఓట్లు పొందేందుకు ప్రయత్నిస్తుందని విమర్శించారు.

Summer Season: కారు కడగడంపై నిషేధం విధించిన ప్రభుత్వం.. ఏ రాష్ట్రంలో అంటే..

వారసత్వ పన్ను, ఓబీసీ రిజర్వేషన్ కోటా రద్దు చేసి.. వాటిని ముస్లింలకు కట్టబెట్టడం, చోరబాటుదారులకు సంపద పంపిణీ చేస్తుందంటూ కాంగ్రెస్ పార్టీపై బీజేపీ ఆరోపణలు గుప్పిస్తుందని ఈ సందర్బంగా ఆయన గుర్తు చేశారు. అయితే గుజరాత్ మోడల్ అభివృద్ధి దేశవ్యాప్తంగా చేస్తామంటూ బీజేపీ నేతలు చెబుతున్నారని విమర్శించారు.


కానీ మానవాభివృద్ధి సూచిలో దేశంలోని టాప్ టెన్ రాష్ట్రాల్లో గుజరాత్ మాత్రం లేదని ఈ సందర్బంగా వారర దిగ్విజయ్ సింగ్ గుర్తు చేశారు. ఇక ఈవీఎంలపై సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు పట్ల దిగ్విజయ్ సింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Hardeep Nijjar Murder: భారతీయులు అరెస్ట్.. స్పందించిన జై శంకర్

ఈ ఎన్నికల వేళ.. బీజేపీ స్లోగన్.. అబ్ కి బార్, 400 పార్ అంటూ ప్రచారం చేస్తుందన్నారు. అయితే బీజేపీ ముందుగా చెబుతున్న ప్రకారమే ఎన్నికల్లో సీట్లు గెలుచుకుంటుందని ఆయన ఆరోపించారు. అందుకు 2014, 2019 ఎన్నికల వేళ.. ఆ పార్టీ నేతలు ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తామో.. ఎన్నికల ముందే.. అంటే ఎన్నికల ప్రచారంలోనే ప్రకటించారని గుర్తు చేశారు. 2014 ఎన్నికల్లో 272 సీట్లు గెలుస్తామంటూ బీజేపీ.. తన ఎన్నికల ప్రచారంలో ప్రకటించిందన్నారు.


ఆ ఎన్నికల్లో బీజేపీకి 284 సీట్లు వచ్చాయని గుర్తు చేశారు. ఇక 2019లో 300 సీట్లలో విజయం సాధిస్తామంటూ ఇదే బీజేపీ వాళ్లు ప్రచారం చేశారని.. ఆ ఎన్నికల్లో 303 లోక్‌సభ స్థానాల్లో ఆ పార్టీ ఘన విజయం సాధించిందన్నారు. ఎన్నికల ప్రక్రియలో బీజేపీ విజయం వెనుక ఈవీఎంలు ఉన్నాయని నమ్ముతున్నారా? అంటే నమ్మవలసి ఉందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో ఈవీఎంల విషయంలో సుప్రీంకోర్టు దర్మాసనం ఇచ్చిన తీర్పు పట్ల దిగ్విజయ్ సింగ్తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కారు. ఇక మూడో దశ పోలింగ్‌.. అంటే మే 7వ తేదీన దిగ్విజయ్ సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న రాజ్‌ఘర్ లోక్‌సభ స్థానానికి పోలింగ్ జరగనుంది.

Lok Sabha Elections: నేటితో ప్రచారానికి తెర.. ఎల్లుండే మూడో దశ పోలింగ్

ఎన్నికల్లో ఈవీఎంలను రద్దు చేసి.. ఆ స్థానంలో పాత పోలింగ్ విధానం అంటే.. బ్యాలెట్ పేపర్లు ఉంచాలంటూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం కింద పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను జస్టిస్ సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్త్‌తో కూడిన దర్మాసనం తొసి పుచ్చింది. పాత బ్యాలెట్ పేపర్ల విధానం అమలు వల్ల పలు ఇబ్బందులు ఉన్నాయంటూ ఆ ధర్మాసనం పేర్కొంది. ఆ క్రమంలో సదరు పిటిషన్‌ను తొసి పుచ్చింది.

Read National News and Telugu News

Updated Date - May 05 , 2024 | 05:23 PM