Home » Digvijaya Singh
కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్(Digvijaya Singh) రాజ్‌గఢ్(Rajgarh) 2024 లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections 2024) ప్రక్రియను సవాల్ చేస్తూ జబల్‌పూర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ప్రాంతంలో ఎన్నికలను రద్దు చేసి మళ్లీ ఎలక్షన్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు.
దేశంలో సార్వత్రిక ఎన్నికలు కొనసాగుతున్నాయి. మొత్తం ఏడు విడతల్లో ఎన్నికలు జరగనుండగా.. రెండు విడతలు పూర్తయ్యాయి. మూడో విడతలో భాగంగా పది రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 94 పార్లమెంట్ స్థానాలకు మంగళవారం (మే7న) పోలింగ్ జరగనుంది. ఈ లోక్‌సభ స్థానాల్లో ఎన్నికల ప్రచారం ఆదివారం సాయంత్రంతో ముగిసింది.
హిందూ - ముస్లిం వివాదంపై మోదీ రాజకీయ చరిత్ర ఆధారపడి ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. అయితే ఈ అంశం వల్ల ఎవరు ప్రయోజనం పొందుతున్నారో ఆత్మ పరిశీలన చేసుకోవాలంటూ ఈ సందర్బంగా మోదీకి ఆయన సూచించారు.
సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగిస్తూ ఉమ్మడి ఏపీ కాంగ్రెస్ (Congress) మాజీ ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ (Digvijay Singh) మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌లో గెలుపునకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఒకప్పటి కంచుకోట అయిన ఈ స్థానంలో 77 ఏళ్ల దిగ్విజయ్.. బీజేపీ సిటింగ్ ఎంపీ రోడ్మల్‌నగర్‌తో తలపడుతున్నారు...
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ కమల్‌నాథ్, ఆయన కుమారుడు, లోక్‌సభ ఎంపీ నకుల్ నాథ్ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరనున్నట్టు వస్తున్న ఊహాగానాలను ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కొట్టివేశారు. శుక్రవారం రాత్రి కూడా కమల్‌నాథ్‌తో తాను మాట్లాడానని, ఆయన ఛింద్వారాలో ఉన్నారని తెలిపారు.
కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తాజాగా మోదీ ప్రభుత్వంపై తారాస్థాయిలో విరుచుకుపడ్డారు. నిరసన తెలిపేందుకు రైతులను ఢిల్లీకి రాకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డ ఆయన.. దేశంలో అన్నదాతలకు ప్రశ్నించే హక్కు లేకుండా ప్రధాని మోదీ చేశారని ఆరోపించారు.
మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ నేతలు రెండు వర్గాలుగా చీలి ఘర్షణకు దిగారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్, మాజీ అధ్యక్షుడు కమల్‌నాథ్ వర్గాల మధ్య వివాదం చెలరేగింది. నే
అయోధ్య రామమందిర శంకుస్థాపన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (CPP) చైర్‌పర్సన్ సోనియా గాంధీ(Sonia Gandhi)ని ఆహ్వానించినట్లు వచ్చిన వార్తలను కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ సింగ్(Digvijaya Singh) ధృవీకరించారు.
భోపాల్: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల విశ్వసనీయతపై కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ సింగ్ మరోసారి ప్రశ్నించారు. చిప్ ఉన్న ఏ మిషన్నైనా హ్యాక్ చేయవచ్చని అన్నారు.
రాముడు అందరికీ దేవుడే.. కానీ కొంతమంది రాముడితో కూడా రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ అగ్ర నేత దిగ్విజయ్ సింగ్ ( Digvijaya Singh ) అన్నారు.