Share News

Narendra Modi: దేశంలో 10 వందే భారత్ రైళ్లను ప్రారంభించిన మోదీ.. మొత్తం ఎన్నంటే

ABN , Publish Date - Mar 12 , 2024 | 12:29 PM

హోలీ పండుగకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు దేశప్రజలకు గుడ్ న్యూస్ అందించారు. ఏకంగా ఒకేసారి దేశవ్యాప్తంగా 10 వందే భారత్ హైస్పీడ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను వర్చువల్ విధానంలో జెండా ఊపి ప్రారంభించారు.

Narendra Modi: దేశంలో 10 వందే భారత్ రైళ్లను ప్రారంభించిన మోదీ.. మొత్తం ఎన్నంటే

హోలీ పండుగకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు దేశప్రజలకు గుడ్ న్యూస్ అందించారు. ఏకంగా ఒకేసారి దేశవ్యాప్తంగా 10 వందే భారత్ హైస్పీడ్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల(vande Bharat trains)ను వర్చువల్ విధానంలో ప్రధాని మోదీ(Narendra Modi) జెండా ఊపి ప్రారంభించారు. దీంతో మొత్తం ఈ రైళ్ల సంఖ్య 51కి చేరుకుంది. ప్రధాని మోదీ ప్రారంభించిన రైళ్లలో సికింద్రాబాద్-విశాఖపట్నం, అహ్మదాబాద్-ముంబై సెంట్రల్, మైసూరు-డాక్టర్ ఎంజీఆర్ సెంట్రల్ (చెన్నై), పాట్నా-లక్నో, న్యూ జల్పైగురి-పాట్నా, పూరీ-విశాఖపట్నం, లక్నో-డెహ్రాడూన్, కలబురగి - సర్ ఎం విశ్వేశ్వరయ్య, రాంచీ - వారణాసి, ఖజురహో- ఢిల్లీ (నిజాముద్దీన్) ప్రాంతాలు ఉన్నాయి. ఈ రైళ్లు 45 రూట్లలో ప్రాయణించనున్నాయి.


ఈ ట్రైన్ల ప్రారంభంతోపాటు రూ.85,000 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులకు కూడా ప్రధాని(prime minister) ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. తమ ప్రభుత్వం దేశ నిర్మాణ లక్ష్యంలో భాగంగా అభివృద్ధి పనులు చేస్తుందని, ఎన్నికల్లో గెలవడానికి కాదని ఈ సందర్భంగా మోదీ(modi) అన్నారు. 350 'ఆస్తా' రైళ్లలో ఇప్పటి వరకు 4.5 లక్షల మంది అయోధ్యకు వెళ్లారని ప్రధాని గుర్తు చేశారు. తన జీవితాన్ని రైల్వే ట్రాక్‌లపై ప్రారంభించానని మోదీ అన్నారు.

ఒకనొక సమయంలో మన రైల్వేల పరిస్థితి ఇంతకు ముందు ఎంత అధ్వాన్నంగా ఉందో తనకు తెలుసని వెల్లడించారు. ప్రత్యేక రైల్వే బడ్జెట్‌ వ్యవస్థకు స్వస్తి పలికి రైల్వేల(railways) అభివృద్ధికి ప్రభుత్వ సొమ్ము వినియోగించేలా కేంద్ర బడ్జెట్‌లో చేర్చామని స్పష్టం చేశారు. అయితే కొంతమంది మన ప్రయత్నాలను ఎన్నికల కోసమే చేస్తున్నారని ప్రచారం చేస్తున్నారని వెల్లడించారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Khattar Resigns: హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా.. కారణం ఇదే

Updated Date - Mar 12 , 2024 | 12:29 PM