PM Modi: ఆ మార్కులు 100కి కాదు.. కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ సెటైర్ల వర్షం
ABN , Publish Date - Jul 02 , 2024 | 05:52 PM
లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ.. కాంగ్రెస్‌పై సెటైర్ల వర్షం కురిపించారు. 99 మార్కులు వచ్చాయని ఓ బాలుడు సంతోషపడుతున్నాడని..
లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ప్రసంగిస్తూ.. కాంగ్రెస్‌పై (Congress Party) సెటైర్ల వర్షం కురిపించారు. 99 మార్కులు వచ్చాయని ఓ బాలుడు సంతోషపడుతున్నాడని.. కానీ ఆ మార్కులు 100కి కాదు, 543కి వచ్చాయని ఎద్దేవా చేశారు. 13 రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు సున్నా సీట్లు వచ్చాయని.. సున్నా సీట్లు వచ్చినా కాంగ్రెస్ వాళ్లు హీరోల్లా ఫీల్ అవుతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీజేపీ, కాంగ్రెస్ ఫేస్ టు ఫేస్ పోరులో కాంగ్రెస్ స్ట్రైక్‌రేట్ 26 శాతం మాత్రమేనంటూ దుయ్యబట్టారు.
ఇదే సమయంలో ఆయన ఏపీలో బీజేపీ సాధించిన గెలుపు గురించి ప్రధాని మోదీ ప్రస్తావించారు. ఏపీలో ఎన్డీఏ క్లీన్‌స్వీప్ చేసిందని పేర్కొన్నారు. దేశంలోని చాలా ప్రాంతాల్లోనూ ప్రజల ప్రేమను చూరగొన్నామన్నారు. అనేక రాష్ట్రాల ప్రజలు బీజేపీ పాలనను కోరుకుంటున్నారని.. తమ పనులు బాగున్నాయనే ఉద్దేశంతోనే ప్రజలు తమకు మూడోసారి ఛాన్స్ ఇచ్చారని చెప్పారు. ఈసారి తమ ఎన్డీఏ దక్షిణాదిలోనూ సత్తా చాటిందని అన్నారు. కేరళలో తమ పార్టీ ఖాతా తెరిచిందని, తమిళనాడులో కూడా తాము గణనీయమైన ఓట్లను సాధించామని చెప్పారు. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ ప్రజలు సైతం తమ వెంటనే ఉన్నారన్నారు.
ఈసారి కూడా కాంగ్రెస్ పక్కనే కూర్చోవాలని ప్రజలు తీర్పునిచ్చారని.. మూడోసారి కూడా సభలో నినాదాలు చేయాలని కాంగ్రెస్‌కు ప్రజలు చెప్పారని ప్రధాని మోదీ సెటైర్లు వేశారు. అర్థంపర్థం లేని నినాదాలతో కాంగ్రెస్ నేతలు కాలక్షేపం చేస్తున్నారని.. వారి ఆందోళనల్ని ప్రజలు చూస్తున్నారని హెచ్చరించారు. ప్రజా తీర్పుని గౌరవించాలని కాంగ్రెస్ నేతల్ని ఈ సందర్భంగా సూచించారు. బీజేపీ, కాంగ్రెస్ ఫేస్ టు ఫేస్ పోరులో కాంగ్రెస్ స్ట్రైక్‌రేట్ 26 శాతం మాత్రమేనని గుర్తు చేవారు. మిత్రపక్షాల సహాయంతో కాంగ్రెస్ తన సీట్ల సంఖ్యను పెంచుకుందని.. ఒంటరిగా పోటీ చేస్తే గతంలో వచ్చిన ఫలితాలే వచ్చేవని అభిప్రాయపడ్డారు.
Read Latest National News and Telugu News