Polling stations: రాష్ట్రంలో అదనంగా 176 పోలింగ్ కేంద్రాలు
ABN , Publish Date - Mar 20 , 2024 | 11:03 AM
లోక్‌సభ ఎన్నికల నిర్వహణపై జిల్లా కలెక్టర్‌లతో సమావేశమైన అనంతరం అదనంగా 176 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సత్యప్రదసాహు(Satyapradasahu) పేర్కొన్నారు.
- నేటినుంచి నియోజకవర్గాల వారీగా ఈవీఎంల విభజన
- ఎన్నికల ప్రధానాధికారి సత్యప్రదసాహు
చెన్నై: లోక్‌సభ ఎన్నికల నిర్వహణపై జిల్లా కలెక్టర్‌లతో సమావేశమైన అనంతరం అదనంగా 176 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సత్యప్రదసాహు(Satyapradasahu) పేర్కొన్నారు. సచివాలయంలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... ఒక్కో జిల్లాలో ఆహార పదార్థాల ధరలు సమానంగా లేని కారణంగా ఎన్నికల ఖర్చు నిమిత్తం నిర్ణయించిన ధర పట్టికను మళ్లీ పరిశీలించాల్సిందిగా సోమవారం జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. ఈనెల 20 నుంచి 25వ తేది వరకు 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించేలా ఫారాలు అందిస్తామని తెలిపారు. ఎండీఎంకే, నామ్ తమిళర్ పార్టీలకు ఎన్నికల గుర్తు కేటాయించడంపై కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంటుందన్నారు. బుధవారం నుంచి పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఈవీఎం, వీవీపాట్ ఇతర ఎన్నికల సామగ్రి విభజన పనులు ప్రారంభిస్తామన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగుల కంటే ప్రభుత్వ ఉపాధ్యాయులు సుమారు 4 లక్షల మంది పాల్గొంటారని సత్యప్రదసాహు తెలిపారు.