Share News

ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ రోహిత్‌ బాల్‌ కన్నుమూతప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ రోహిత్‌ బాల్‌ కన్నుమూత

ABN , Publish Date - Nov 02 , 2024 | 02:55 AM

ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ రోహిత్‌ బాల్‌ (63) శుక్రవారం ఇక్కడ కన్నుమూశారు. ఆయన ఏడాది కాలంగా హృద్రోగంతో బాధపడుతున్నారు.

ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ రోహిత్‌ బాల్‌ కన్నుమూతప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ రోహిత్‌ బాల్‌ కన్నుమూత

న్యూఢిల్లీ, నవంబరు 1: ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ రోహిత్‌ బాల్‌ (63) శుక్రవారం ఇక్కడ కన్నుమూశారు. ఆయన ఏడాది కాలంగా హృద్రోగంతో బాధపడుతున్నారు. చివరిసారిగా గత నెలలో ఢిల్లీలో నిర్వహించిన లక్మే ఇండియా ఫ్యాషన్‌ వీక్‌లో పాల్గొన్నారు. ఆ సమయంలో ర్యాంపు వద్ద తూలి పడిపోవడంతో ఆయన ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందారు. సంప్రదాయాలు, ఆధునికతను మేళవించి దుస్తులకు రూపకల్పన చేయడం ద్వారా ఆయన ప్రత్యేకతను చాటుకున్నారు. కశ్మీర్‌కు చెందిన రోహిత్‌ ఢిల్లీలోని సెయింట్‌ స్టీఫెన్‌ కళాశాలలో డిగ్రీ చదివారు. అంతర్జాతీయ సెలబ్రెటీలైన పమేలా అండర్సన్‌, నవోమీ క్యాంప్‌బెల్‌తో పాటు పలువురు బాలీవుడ్‌ నటులకు డిజైనర్‌గా పనిచేశారు.

Updated Date - Nov 02 , 2024 | 02:55 AM