Delhi Airport: విద్యుత్ అంతరాయంతో ఢిల్లీ ఎయిర్‌పోర్టులో నిలిచిపోయిన బోర్డింగ్, చెక్‌ఇన్‌లు
ABN , Publish Date - Jun 17 , 2024 | 04:07 PM
ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం సుమారు 20 నిమిషాల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో పలు ఎయిర్‌లైన్స్‌కు సంబంధించిన బోర్డింగ్, చెక్‌ఇన్ సౌకర్యంపై ప్రబావం పడింది. టెర్నినల్ 2పై ఉన్న పలు విమానాల సర్వీసుల్లో జాప్యం తలెత్తింది.
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం సుమారు 20 నిమిషాల పాటు విద్యుత్ సరఫరా (Power outage) నిలిచిపోయింది. దీంతో పలు ఎయిర్‌లైన్స్‌కు సంబంధించిన బోర్డింగ్, చెక్‌ఇన్ సౌకర్యంపై ప్రబావం పడింది. టెర్నినల్ 2పై ఉన్న పలు విమానాల సర్వీసుల్లో జాప్యం తలెత్తింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వందలాది ప్రయాణికులు క్యూలలో నిలిచిపోయారు. ఏం జరుగుతోందో తెలియక ఆందోళనకు గురయ్యారు.
విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో చెక్ ఇన్ ప్రొసీజర్, సెక్యూరిటీ చెకప్‌లకు కీలకమైన ఎలక్ట్రానికి సిస్టమ్‌లు మొరాయించారు. బోర్డింగ్ పాస్‌లు, బ్యాగేజ్ హ్యాండ్లింగ్ వంటి సమస్యలు తలెత్తినట్టు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితిని చక్కదిద్ది, ప్రయాణికులకు సహకరించేందుకు అదనపు సిబ్బందిని విమానాశ్రయ అధికారులు వెంటనే రంగంలోకి దింపారు. టెర్నినల్ 3లో 15 నిమిషాల పాటు లైటు కూడా లేదని, నీళ్లు, కాఫీ, తినుబండారాలు కూడా కొనుగోలు చేయలేకపోయామని, ఎవరైనా పట్టించుకునే వారున్నారా? అంటూ ఓ ప్రయాణికుడు సామాజిక మాధ్యమ్యం 'ఎక్స్'లో పోస్ట్ పెట్టారు. కాగా, విద్యుత్ సరఫరా నిలిచిపోవడానికి కారణాలు వెంటనే తెలియలేదు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..