LoKSabha Elections: ఇంతకీ ప్రజ్వల్ వీడియోలు బయటికెలా వచ్చాయి..?
ABN , Publish Date - Apr 30 , 2024 | 06:02 PM
కర్ణాటక రాష్ట్ర రాజకీయాలను హెచ్ డీ దేవగౌడ మనవడు, హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ రాసలీలల వీడియోలు ఓ కుదుపు కుదిపేశాయి. అదీకూడా లోక్‌సభ ఎన్నికల వేళ.. ఈ వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. దీంతో కర్ణాటకలోని అధికార కాంగ్రెస్ పార్టీకి సరైన సమయంలో.. సరైన ఆయుధం దొరికినట్లు అయింది.
బెంగళూరు, ఏప్రిల్ 30: కర్ణాటక రాష్ట్ర రాజకీయాలను హెచ్ డీ దేవగౌడ మనవడు, హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ రాసలీలల వీడియోలు ఓ కుదుపు కుదిపేశాయి. అదీకూడా లోక్‌సభ ఎన్నికల వేళ.. ఈ వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. దీంతో కర్ణాటకలోని అధికార కాంగ్రెస్ పార్టీకి సరైన సమయంలో.. సరైన ఆయుధం దొరికినట్లు అయింది.
NDA Manifesto: కూటమి మేనిఫెస్టోలో ఈ కీలక విషయాలు గమనించారా..!?
మరోవైపు ఈ ఎన్నికల్లో జేడీ(ఎస్)తో బీజేపీ జతకట్టి బరిలో దిగింది. ఆ క్రమంలో ఆ రెండు పార్టీలపై కాంగ్రెస్ విమర్శనాస్త్రాలు సంధిస్తుంది. దాంతో జేడీ(ఎస్) సైలెంట్‌గా ఉన్నా.. బీజేపీ మాత్రం స్పందించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఆ క్రమంలోకేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పందించిన విషయం విధితమే.
అయితే ఎంపీ ప్రజ్వల్ వీడియోలు ఎలా బయటకు వచ్చాయనే అంశంపై సర్వత్ర చర్చ సాగుతోంది. ఈ మొత్తం వ్యవహారం బహిర్గతం కావడానికి ప్రజ్వల్ కారు మాజీ డ్రైవర్ కార్తీక్ గౌడ అని తెలుస్తోంది. రేవణ్ణ కుటుంబానికి డ్రైవర్ కార్తీక్ గౌడకి మధ్య భూమికి సంబంధించిన తగదా ఉంది. అందుకు సంబంధించిన కేసు ప్రస్తుతం న్యాయస్థానంలో ఉంది.
TS SSC Supplementary Exam 2024: తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల
ఈ నేపథ్యంలో ప్రజ్వల్ కారు డ్రైవర్‌గా ఉన్న సమయంలో అతడు చేసిన అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన వీడియోలు ఉన్న పెన్‌డ్రైవ్‌ను కార్తీక్ గౌడ చేజిక్కించుకున్నారు. అయితే తనకు రేవణ్ణ కుటుంబానికి మధ్య నలుగుతున్న భూ వివాదం పరిష్కరించేందుకు సహకరించాలని స్థానిక బీజేపీ నాయకడు దేవరాజే గౌడను కార్తీక గౌడ ఆశ్రయించారు.
Nampally CBI Court: మళ్లీ మొదటికొచ్చిన జగన్ అక్రమాస్తుల కేసు
అతడు హామీ ఇవ్వడంతో.. ఆ పెన్‌డ్రైవ్‌ను దేవరాజే గౌడ చేతిలో పెట్టారు. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజ్వల్ తండ్రి హెచ్ డీ రేవణ్ణ ప్రత్యర్థిగా దేవరాజే గౌడ పోటీ చేశారు.
మరోవైపు దేవరాజే గౌడ ఈ ఏడాది జనవరిలో కర్ణాటక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బివై విజయేంద్రకు లేఖ రాశారు. జేడీ (ఎస్) నాయకుడు, హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై భయంకరమైన ఆరోపణలు ఉన్నాయని ఆ లేఖలో వివరించారు. అంతేకాదు అతడి రాసలీలకు సంబంధించిన వందలాది వీడియోలు ఉన్న పెన్‌డ్రైవ్ సైతం తన వద్ద ఉందని ఆ లేఖలో స్పష్టం చేశారు.
LokSabha Elections: ఎంపీ గారి రాసలీలలు.. స్పందించిన టాలీవుడ్ హీరోయిన్
అయితే ఇదే పెన్‌డ్రైవ్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక వద్ద ఉందని.. ఆయన ఆ లేఖలో స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో జేడీ(ఎస్) పార్టీతో పొత్తు పెట్టుకుంటే రాజకీయంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కొవలసి వస్తుందని ఆ లేఖలో దేవరాజే గౌడ సందేహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. ఇది ప్రత్యర్థులకు బ్రహ్మాస్త్రంగా మారే అవకాశం ఉందని కూడా ఆయన ఆ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు.
దీంతో జాతీయ స్థాయిలో పార్టీకి చెడ్డ పేరు వచ్చే ప్రమాదముందన్నారు. ఇంకో వైపు ఇదే అంశంపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు సైతం దేవరాజే గౌడ లేఖ రాశారు. అయితే ఈ పెన్‌డ్రైవ్ కాంగ్రెస్ నేతలకు కార్తీక్ గౌడ అందించారంటూ దేవరాజే గౌడ చేస్తున్న ఆరోపణలను కార్తీక గౌడ ఖండించారు. దేవరాజే గౌడకు తప్ప మరొకరికి తాను పెన్‌డ్రైవ్ ఇవ్వలేదని స్పష్టం చేశారు. భూ వివాదం కేసులో తనపై రేవణ్ణ కుటుంబం తీవ్ర ఒత్తిడి చేస్తుందని.. దాంతో తాను న్యాయ సహయం కోసం దేవరాజేను ఆశ్రయించానని చెప్పారు.
తొలుత తనకు న్యాయ సహాయం చేస్తానని చెప్పిన ఇదే దేవరాజే .. ఆ తర్వాత ఆయన ఆ మాట నిలుపుకోలేదన్నారు. అయితే ఆయనకు పెన్‌డ్రైవ్ ఇచ్చేటప్పుడు .. ఎందుకోసమనే విషయాన్ని మాత్రం ఆయన్ని తాను అడగలేదన్నారు. కానీ ఆ తర్వాత ఆ పెన్‌డ్రైవ్ తనకు ఇవ్వమంటే... న్యాయస్థానానికి అందచేద్దామని దేవరాజే తనతో అన్నారన్నారు.
karnataka politics: ప్రజ్వల్‌పై సస్పెన్షన్ వేటు
అయితే దేవరాజ్ సైతం తనను మోసం చేశాడని రేవణ్ణ కారు మాజీ డ్రైవర్ కార్తీక్ గౌడ ఈ సందర్బంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకోవైపు తొలి దశ పోలింగ్‌లో భాగంగా ఏప్రిల్ 26వ తేదీ కర్ణాటకలోని హాసన్‌తోపాటు పలు ఎంపీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలకు ఒక రోజు ముందు ప్రజ్వల్ రాసలీలల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. ఆ మరునాడే అంటే శనివారం ప్రజ్వల్.. జర్మనీ వెళ్లిపోవడం గమనార్హం.
Read latest National News And Telugu News