Share News

Premalatha: రేపటినుంచి ప్రేమలత ప్రచారం..

ABN , Publish Date - Mar 28 , 2024 | 12:22 PM

డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత(Premalatha) కూటమి అభ్యర్థులకు మద్దతుగా లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని శుక్రవారం ప్రారంభించనున్నారు.

Premalatha: రేపటినుంచి ప్రేమలత ప్రచారం..

చెన్నై: డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత(Premalatha) కూటమి అభ్యర్థులకు మద్దతుగా లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని శుక్రవారం ప్రారంభించనున్నారు. నీలగిరి, కోయంబత్తూరు, తిరుప్పూరు, ఈరోడ్‌ జిల్లాల్లో, 30న కృష్ణగిరి, ధర్మపురం, సేలంలో, 31న కన్నియాకుమారి, విల్లుపురం, చిదంబరంలో ఆమె ప్రచారం చేయనున్నారు. అదే విధంగా ఏప్రిల్‌ 1న పెరంబలూరు, పుదుకోట, తిరుచ్చిలో, 2న తిరువణ్ణామలై, వేలూరు, అరక్కోణంలల్లో ప్రచార పర్యటన సాగిస్తారు. ఏప్రిల్‌ 3, 4 తేదీల్లో తిరువళ్లూరు, కాంచీపురం, శ్రీపెరుంబుదూరు నియోజకవర్గాల్లో, 5, 6 తేదీల్లో నగరంలోని మూడు లోక్‌సభ నియోజకవర్గాలలో ఆమె ప్రచారం చేస్తారు. 7, 8 తేదీలలో కడలూరులో, 9,10 తేదీల్లో మైలాడుదురై, తంజావూరు, తిరువారూరు నియోజకవర్గాల్లో, 11న కన్నియాకుమారి, తూత్తుకుడి, తిరునల్వేలిలో, 12న రామనాఽథపురం, శివగంగ, దిండుగల్‌లో ప్రచారం చేస్తారు. ఏప్రిల్‌ 13న కరూరు, నామక్కల్‌, తేని నియోజకవర్గాల్లో, 14వ తేదీ నుంచి 17 వరకు మదురై, తెనకాశి, విరుదునగర్‌లో ప్రచారం చేయనున్నారు. ఏప్రిల్‌ 17 సాయంత్రం విరుదునగర్‌ బహిరంగ సభలో ఆమె పాల్గొని తన ప్రచారాన్ని ముగించనున్నారు.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

Updated Date - Mar 28 , 2024 | 12:22 PM