Home » DMDK
కూటమిపై విజయ్(Vijay)ను ప్రశ్నించాలని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత(Premalatha) మీడియాకు సూచించారు. కళ్లుకుర్చి పార్టీ నిర్వాహకుడి ఇంటి వివాహ వేడుకల్లో పాల్గొన్న ప్రేమలత మీడియాతో మాట్లాడుతూ.. అన్నాడీఎంకేతో టీవీకే(TVK) పొత్తు కుదుర్చుకుంటుందా అనే ప్రశ్నకు విజయ్ను అడగాలని సూచించారు.
కొత్తగా రాజకీయ పార్టీని స్థాపించిన సినీ నటుడు విజయ్ మున్ముందు అనేక రాజకీయ సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్(Premalatha Vijayakanth) అభిప్రాయపడ్డారు.
విరుదునగర్ లోక్‌సభ నియోజకవర్గంలో రీకౌంటింగ్ జరపాలని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత(Premalatha) డిమాండ్ చేశారు. కోయంబేడులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఉదయం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తమ పార్టీ తరఫున విరుదునగర్‌లో పోటీ చేసిన కెప్టెన్ విజయకాంత్ తనయుడు విజయ ప్రభాకర్ ఓడిపోలేదని, కొందరి కుట్రకారణంగా ఓడించబడ్డాడని ఆరోపించారు.
డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత(Premalatha) కూటమి అభ్యర్థులకు మద్దతుగా లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని శుక్రవారం ప్రారంభించనున్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో ఏ కూటమిలో చేరాలనే విషయంపై ఈ నెల 21న అధికారికంగా ప్రకటిస్తానని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత(Premalatha) పేర్కొన్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలన్న లక్ష్యంతో తీవ్రంగా శ్రమిస్తున్న బీజేపీ(BJP).. తమ కూటమిలోకి బలమైన పార్టీలను ఆకర్షించేందుకు గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది.
వచ్చే యేడాది రాష్ట్రంలో ఖాళీ పడనున్న రాజ్యసభ స్థానాలకు జరిగే ఎన్నికల్లో తమ పార్టీకి ఒక సీటు కేటాయించాలని డీఎండీకే నాయకురాలు ప్రేమలత పట్టుబడుతుండటంతో అన్నాడీఎంకేతో సీట్ల సర్దుబాట్ల ప్రతిష్టంభన కొనసాగుతోంది.
పార్లమెంటు ఎన్నికల్లో 14 ఎంపీ సీట్లు, రాజ్యసభ సీటు ఇచ్చే పార్టీతోనే పొత్తు ఉంటుందని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత(Premalatha) ప్రకటించారు. కోయంబేడులోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ జిల్లా కార్యదర్శులు, నిర్వాహకులతో ప్రేమలత సమీక్షా సమావేశం నిర్వహించారు.
డీఎంకే, అన్నాడీఎంకే కూటములకు ప్రత్యామ్నాయంగా కొత్త కూటమి ఏర్పాటుకు ప్రయత్నిస్తున్న బీజేపీ(BJP).. డీఎండీకేను దరి చేర్చుకునేందుకు సన్నాహాలు చేస్తోంది.
‘కెప్టెన్’ మన మధ్య నుంచి వెళ్లిపోయినా, ఆయన ఆత్మ మనతోనే ఉంటుందని, ఆయన ఆశయాలు కొనసాగిద్దామని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్(Premalatha Vijayakanth) పిలుపునిచ్చారు.