Share News

Premalatha: కూటమిపై విజయ్‌ని ప్రశ్నించండి..

ABN , Publish Date - Nov 21 , 2024 | 11:56 AM

కూటమిపై విజయ్‌(Vijay)ను ప్రశ్నించాలని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత(Premalatha) మీడియాకు సూచించారు. కళ్లుకుర్చి పార్టీ నిర్వాహకుడి ఇంటి వివాహ వేడుకల్లో పాల్గొన్న ప్రేమలత మీడియాతో మాట్లాడుతూ.. అన్నాడీఎంకేతో టీవీకే(TVK) పొత్తు కుదుర్చుకుంటుందా అనే ప్రశ్నకు విజయ్‌ను అడగాలని సూచించారు.

Premalatha: కూటమిపై విజయ్‌ని ప్రశ్నించండి..

- డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత

చెన్నై: కూటమిపై విజయ్‌(Vijay)ను ప్రశ్నించాలని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత(Premalatha) మీడియాకు సూచించారు. కళ్లుకుర్చి పార్టీ నిర్వాహకుడి ఇంటి వివాహ వేడుకల్లో పాల్గొన్న ప్రేమలత మీడియాతో మాట్లాడుతూ.. అన్నాడీఎంకేతో టీవీకే(TVK) పొత్తు కుదుర్చుకుంటుందా అనే ప్రశ్నకు విజయ్‌ను అడగాలని సూచించారు. అన్నాడీఎంకే(AIADMK) నేతృత్వంలో బలమైన కూటమి ఏర్పాటవుతుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల తేది ప్రకటించిన తర్వాత తాము పోటీచేసే స్థానాలు ప్రకటిస్తామని తెలిపారు.

ఈ వార్తను కూడా చదవండి: Chennai: ప్రేమోన్మాది ఘాతుకం.. తరగతి గదిలో టీచర్ దారుణహత్య


nani3.2.jpg

తమిళనాడుకు ముఖ్యమైన భాష తమిళమని, వేరే ఏ భాషను నిర్భధించలేదన్నారు. అవాకులు చెవాకులు మాట్లాడుతుంది అనే తమిళ సామెత తెలియక మాట్లాడిన కస్తూరి పెద్ద చిక్కులు ఎదురుచూసిందన్నారు. అదే సమయంలో ఎందరో నేతలు మహిళల గురించి నీచంగా మాట్లాడారని, మరి వారిని ఎందుకు అరెస్ట్‌ చేయలేదని ప్రశ్నించారు. హైదరాబాద్‌ వెళ్లి కస్తూరిని పోలీసులు అరెస్ట్‌ చేయడం అన్యాయమని ప్రేమలత పేర్కొన్నారు.


ఈవార్తను కూడా చదవండి: తెలంగాణ క్యాడర్‌ ప్రాసిక్యూటర్ల సంఘం అధ్యక్షుడిగా రాంరెడ్డి

ఈవార్తను కూడా చదవండి: Midday Meal: మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్‌ పాయిజన్‌

ఈవార్తను కూడా చదవండి: TET: ముగిసిన టెట్‌ గడువు..22 వరకు ఎడిట్‌ ఆప్షన్‌

ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: సీఎం రేవంత్ పర్యటన.. రోడ్డెక్కిన దళిత సంఘాల నాయకులు..

Read Latest Telangana News and National News

Updated Date - Nov 21 , 2024 | 11:56 AM