Premalatha: ఆ నియోజకవర్గంలో రీకౌంటింగ్ జరపాలి..
ABN , Publish Date - Jun 07 , 2024 | 12:21 PM
విరుదునగర్ లోక్‌సభ నియోజకవర్గంలో రీకౌంటింగ్ జరపాలని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత(Premalatha) డిమాండ్ చేశారు. కోయంబేడులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఉదయం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తమ పార్టీ తరఫున విరుదునగర్‌లో పోటీ చేసిన కెప్టెన్ విజయకాంత్ తనయుడు విజయ ప్రభాకర్ ఓడిపోలేదని, కొందరి కుట్రకారణంగా ఓడించబడ్డాడని ఆరోపించారు.
- ప్రేమలత డిమాండ్
చెన్నై: విరుదునగర్ లోక్‌సభ నియోజకవర్గంలో రీకౌంటింగ్ జరపాలని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత(Premalatha) డిమాండ్ చేశారు. కోయంబేడులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఉదయం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తమ పార్టీ తరఫున విరుదునగర్‌లో పోటీ చేసిన కెప్టెన్ విజయకాంత్ తనయుడు విజయ ప్రభాకర్ ఓడిపోలేదని, కొందరి కుట్రకారణంగా ఓడించబడ్డాడని ఆరోపించారు. కౌంటింగ్ చురుకుగా సాగుతుండగా ఉన్నట్టుండి మధ్యాహ్నం 3 నుండి 5 గంటల దాకా కౌంటింగ్ నిలిపివేశారని, అదే సమయంలో ఎన్నికల అధికారిగా ఉన్న జిల్లా కలెక్టర్ తనపై తీవ్ర ఒత్తిడి పెరిగిందంటూ సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంచారన్నారు. తమ పార్టీ ఎన్నో ఎన్నికలను ఎదుర్కొన్నదని, అయితే విరుదునగర్ కౌంటింగ్ సమయంలో జరిగినంత అక్రమాలను ఎన్నడూ చూడలేదన్నారు.
ఇదికూడా చదవండి: Congress: ఆ నియోజకవర్గంలో ‘కాంగ్రెస్’ బాగానే పుంజుకుందిగా..
విరుదునగర్‌లో రీకౌంటింగ్ జరపాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి వినతి పత్రం సమర్పించినట్లు తెలిపారు. 13వ రౌండ్ ఓట్ల లెక్కింపు సమయంలోనే అక్రమాలు జరిగాయని ఆమె ఆరోపించారు. ఈ నేపథ్యంలో రిటైర్డ్ జడ్జి సమక్షంలో విరుదునగర్ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు మళ్ళీ జరపాలని ప్రేమలత డిమాండ్ చేశారు. భోజన విరామ సమయం తర్వాత రెండు గంటలపాటు కౌంటింగ్ నిలిపివేయడానికి గల కారణాలను అధికారులు వివరించాలని ఆమె డిమాండ్ చేశారు.
మాణిక్కం ఠాగూర్ ఖండన...
విరుదునగర్ ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయంటూ డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత ఆరోపించడాన్ని ఆ నియోజకవర్గంలో గెలిచిన ఎంపీ మాణిక్కం ఠాగూర్ ఖండించారు. ఓట్ల లెక్కింపు ముగిసిన తరువాత డీఎండీకే అభ్యర్థి, ఆయన ఏజెంట్లు ప్రశాంతంగా వెళ్ళిపోయారని, అక్రమాలు జరిగి ఉంటే అప్పుడే ఫిర్యాదు చేసి ఉండాలని తెలిపారు. కౌంటింగ్‌లో ఎక్కడా ఎలాంటి అవినీతి అక్రమాలు జరుగలేదని ఆయన వివరించారు.
ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News