Priyanaka Gandhi: ఆసుపత్రి నుంచి ప్రియాంక గాంధీ డిశ్చార్జి
ABN , Publish Date - Feb 19 , 2024 | 05:26 PM
అస్వస్థతతో శ్రీ గంగారామ్ ఆసుపత్రిలో చేరిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా చికిత్స అనంతరం సోమవారంనాడు డిశ్చార్జి అయ్యారు. అతిసారం, పొత్తికడుపు ఇన్ఫెక్షన్తో ఈనెల 16న ఆసుపత్రిలో ప్రియాంక చేరారు.
న్యూఢిల్లీ: అస్వస్థతతో శ్రీ గంగారామ్ ఆసుపత్రిలో చేరిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra) చికిత్స అనంతరం సోమవారంనాడు డిశ్చార్జి అయ్యారు. అతిసారం, పొత్తికడుపు ఇన్ఫెక్షన్తో ఈనెల 16న ఆసుపత్రిలో ప్రియాంక చేరారు.
ఆసుపత్రిలో చేరిన కారణంగా ఫిబ్రవరి 16న ఉత్తరప్రదేశ్‌లోని ఛాందౌలిలో జరిగే భారత్ జోడో యాత్రలో పాల్గొనలేకపోతున్నట్టు ప్రియాంక ఇంతకుముందు ట్వీట్ చేశారు. ఆరోగ్యం కుదుటపడగానే యాత్రలో పాల్గొంటానని తెలిపారు. భారత్ జోడో యాత్ర 16వ తేదీన వారణాసి మీదుగా ఉత్తరప్రదేశ్‌లో ప్రవేశించింది. 19న బదోహి, ప్రయాగ్‌రాజ్, ప్రతాప్‌గఢ్ మీదుగా అమేధీకి చేరుతుంది. 20న రాయబరేలిలో యాత్ర సాగుతుంది.