Share News

Punjab: కాలవలో పడిన బస్సు.. 8 మంది మృతి

ABN , Publish Date - Dec 27 , 2024 | 06:10 PM

Punjab: పంజాబ్‌లోని బఠిండాలో ఘోర ప్రమాదం జరిగింది. వంతెన రెయిలింగ్ ఢీకొని బస్సు కాల్వలో పడింది. ఈ ప్రమాదంలో 8 మంది మరణించారు. మరో 18 మంది గాయపడ్డారు.

Punjab: కాలవలో పడిన బస్సు.. 8 మంది మృతి

పంజాబ్, డిసెంబర్ 27: పంజాబ్‌లోని బఠెండాలో వంతెన రెయిలింగ్‌ను ఢీ కొని.. బస్సు కాల్వలో పడిపోయింది. ఈ ఘటనలో 8 మంది ప్రయాణికులు మరణించారు. మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. బఠిండాలోని షాహిద్ బాయ్ మాన్ సింగ్ సివిల్ ఆసుపత్రిలో వారంతా చికిత్స పొందుతున్నారని ఉన్నతాధికారులు వెల్లుడించారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందన్నారు. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఐదుగురు మరణించగా.. మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారని వివరించారు. ఎన్‌డీఆర్ఎఫ్, పోలీసులు, స్థానికుల సహయంతో సహాయక చర్యలు కొనసాగుతోన్నాయన్నారు.

తల్వాండి సాబో నుంచి బఠిండా నగరానికి వస్తుండగా ఈ బస్సు ప్రమాదానికి గురైందని తెలిపారు. అయితే మృతులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని జిల్లా అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బఠిండాలో భారీ వర్షం కురుస్తుందన్నారు. మరోవైపు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే జిల్లా ఉన్నతాధికారులు ఘటన స్థలానికి చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో.. బస్సులో ప్రయాణికుల సంఖ్య భారీగా ఉన్నట్లు తెలుస్తోంది.


Also Read: బియ్యం మాయం కేసులో వాదనలు పూర్తి.. తీర్పు రిజర్వ్

Also Read: కేంద్ర మంత్రి సన్నిహితుడిపై ఈడీ ఫోకస్

Also Read: జాక్ పాట్ కొట్టిన ట్రాఫిక్ పోలీసులు

Also Read: మన్మోహన్ సింగ్‌ భావజాలం శాశ్వతంగా నిలిచి ఉంటుంది

For National News And Telugu News

Updated Date - Dec 27 , 2024 | 06:10 PM