Share News

Rahul Gandhi: సంభాల్ బాధితులను కలిసిన రాహుల్, ప్రియాంక

ABN , Publish Date - Dec 10 , 2024 | 09:50 PM

రాహుల్, ప్రియాంక డిసెంబర్ 4న సంభాల్ వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించే ప్రయత్నం చేసినప్పటికీ ఉత్తరప్రదేశ్ పోలీసులు అనుమతి నిరాకరించారు. పరిస్థితి మెరుగుపడిన తర్వాత రావాలని రాహుల్‌కు పోలీసులు సూచించడంతో ఆయన వెనుదిరిగారు.

Rahul Gandhi: సంభాల్ బాధితులను కలిసిన రాహుల్, ప్రియాంక

న్యూఢిల్లీ: సంభాల్ హింసాకాండ (Sambhal violence)లో బాధిత కుటుంబాలను లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, ఆయన సోదరి, పార్లమెంటు సభ్యురాలు ప్రియాంక గాంధీ వాద్రా మంగళవారంనాడు కలుసుకున్నారు. ఢిల్లీలోని 10 జన్‌పథ్ నివాసంలో వీరి సమావేశం జరిగింది. రాహుల్, ప్రియాంక డిసెంబర్ 4న సంభాల్ వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించే ప్రయత్నం చేసినప్పటికీ ఉత్తరప్రదేశ్ పోలీసులు అనుమతి నిరాకరించారు. పరిస్థితి మెరుగుపడిన తర్వాత రావాలని రాహుల్‌కు పోలీసులు సూచించడంతో ఆయన వెనుదిరిగారు. ఈ నేపథ్యంలో సంభాల్ బాధిత కుటుంబాలను ఢిల్లీలోని సోనియాగాంధీ నివాసమైన 10 జన్‌పథ్‌లోనే రాహుల్, ప్రియాంక కలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తామని రాహుల్ భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది.

Kiran Rijiju: మెజారిటీ మాదే.. ధన్‌ఖడ్‌పై అవిశ్వాస తీర్మానంలో పసలేదు


మొఘలుల కాలం నాటి షాహి జామా మసీదు స్థానంలో హరిహర టెంపుల్ ఉండేదంటూ పిటిషన్లు దాఖలు కావడంతో మసీదు సర్వీసు కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో నవంబర్ 19 నుంచి సంభాల్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నవంబర్ 24న కోర్టు ఆదేశాలతో సర్వేకు అధికారులు సిద్ధపడటంతో ఆందోళనకారులకు, భద్రతా సిబ్బందికి మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ సందర్భంగా చోటుచేసుకున్న హింసాకాండలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. దీంతో సెక్షన్ 163ని వెంటనే అమల్లోకి తెచ్చారు. డిసెంబర్ 31వ తేదీ వరకూ కర్ఫ్యూను పొడిగించారు.


ఇవి కూడా చదవండి..

INDIA Block: మమతకు మద్దతు తెలిపిన మాజీ సీఎం

CM Stalin: సీఎం స్టాలిన్ సంచలన కామెంట్స్.. ఆ ప్రాజెక్టు అమలైతే పదవికి రాజీనామా..

For National News And Telugu News

Updated Date - Dec 10 , 2024 | 09:50 PM