Share News

Bharat Jodo Nyay Yatra: ఆదివారం నుంచి రాహుల్ గాంధీ 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'

ABN , Publish Date - Jan 13 , 2024 | 09:37 PM

న్యూఢిల్లీ, జనవరి 13: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జనవరి 14వ తేదీ నుంచి భారత్ జోడో న్యా్య్ యాత్ర చేపట్టనున్నారు. మణిపూర్‌లోని తౌబల్ నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. ఆదివారం ప్రారంభమయ్యే యాత్ర 15 రాష్ట్రాలు.. 110 జిల్లాలు.. 6,700 కిలోమీటర్లు.. 100 లోక్‌సభ నియోజకవర్గాలు కవర్ చేస్తూ 66 రోజులు కొనసాగనుంది.

Bharat Jodo Nyay Yatra: ఆదివారం నుంచి రాహుల్ గాంధీ 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'
Bharat Jodo Nyay Yatra

న్యూఢిల్లీ, జనవరి 13: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జనవరి 14వ తేదీ నుంచి భారత్ జోడో న్యాయ్ యాత్ర చేపట్టనున్నారు. మణిపూర్‌లోని తౌబల్ నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. ఆదివారం ప్రారంభమయ్యే యాత్ర 15 రాష్ట్రాలు.. 110 జిల్లాలు.. 6,700 కిలోమీటర్లు.. 100 లోక్‌సభ నియోజకవర్గాలు కవర్ చేస్తూ 66 రోజులు కొనసాగనుంది. మార్చి 20 గానీ, 21వ తేదీన గానీ ముంబయిలో ముగియనుంది. గత 10 సంవత్సరాలుగా దేశంలో చోటు చేసుకున్న అన్యాయాలు, అరాచకాలకు వ్యతిరేకంగా గళం విప్పడమే ఈ భారత్ జోడో న్యాయ్ యాత్ర సంకల్పం. ఇందుకు సంబంధించిన థీమ్ సాంగ్‌ను కూడా ఇవాళ విడుదల చేసింది కాంగ్రెస్.

న్యాయ్ యాత్రలో సీఎం రేవంత్..

ఇదిలాఉంటే.. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ మణిపూర్ లోని తౌబల్ నుంచి ఆదివారం ప్రారంభించనున్న భారత్ న్యాయ్ యాత్రపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఢిల్లీలోని ఖర్గే నివాసంలో సాయంత్రం నిర్వహించిన ఈ సమావేశంలో ఖర్గే, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కేసీ వేణుగోపాల్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. కాగా, భారత్ జోడో న్యాయ్ యాత్రలో సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొంటారని సమాచారం.

Updated Date - Jan 13 , 2024 | 09:37 PM