Rahul Gandhi: నాపై ఈడీ దాడులు చేస్తుంది.. చక్రవ్యూహ ప్రసంగంతో బీజేపీ కక్ష పెంచుకుందన్న రాహుల్
ABN , Publish Date - Aug 02 , 2024 | 03:00 PM
లోక్‌సభలో బీజేపీ(BJP) విధానాలపై తాను చేసిన చక్రవ్యూహ ప్రసంగంపై కాషాయ పార్టీ తనపై పగ పెంచుకుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఆరోపించారు. ఇందుకు సంబంధించి ఆయన శుక్రవారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ఢిల్లీ: లోక్‌సభలో బీజేపీ(BJP) విధానాలపై తాను చేసిన చక్రవ్యూహ ప్రసంగంపై కాషాయ పార్టీ తనపై పగ పెంచుకుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఆరోపించారు. ఇందుకు సంబంధించి ఆయన శుక్రవారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. చక్రవ్యూహ ప్రసంగంతోనే ఈడీ తనపై దాడులు నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తోందని అంతర్గతంగా తెలిసినట్లు రాహుల్ చెప్పారు.
"కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ నాపై దాడి చేసేందుకు సిద్ధం అవుతోంది. లోక్‌సభలో నేను చేసిన చక్రవ్యూహ ప్రసంగం 2 ఇన్ 1కు ఏమాత్రం నచ్చలేదు. అందుకే ఈడీని ఉసిగొల్పుతున్నారు. చాయ్, బిస్కెట్లతో అధికారుల కోసం ఉత్సాహంతో ఎదురు చూస్తుంటా. ఇలాంటి దాడులను తట్టుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. వారిని స్వాగతిస్తాను. ప్రధాని మోదీ పాలనలో దేశంలోని రైతులు, కార్మికులు, యువత భయాందోళనకు గురవుతున్నారు" అని రాహుల్ ఎక్స్‌లో పేర్కొన్నారు.
చక్రవ్యూహ ప్రసంగం అంటే?
జులై 29వ తేదీన కేంద్ర బడ్జెట్‌పై రాహుల్ గాంధీ సుధీర్ఘ ప్రసంగం చేశారు. మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాలపై విమర్శనాస్త్రాలు సంధించారు. బీజేపీకి గుర్తు కమలాన్ని ప్రదర్శించిన ఆయన 21వ శతాబ్దంలో కొత్త చక్రవ్యూహం సిద్ధమైందంటూ విమర్శలు గుప్పించారు. తాను చేసిన చక్రవ్యూహం ప్రసంగం అనంతరం తనపై దాడికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) ప్లాన్ చేసిందని ఆరోపించారు.
ఈ విషయం ఈడీ అంతర్గత వర్గాల ద్వారా తనకు తెలిసిందన్నారు. మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యుడిని ఆరుగురు వ్యక్తులు చక్రవ్యూహంలో బంధించి చంపారని, తాను కొంచెం పరిశోధన చేసి చక్రవ్యూహాన్ని కనిపెట్టినట్లు రాహుల్ చెప్పారు. చక్రవ్యూహాన్ని పద్మవ్యూహం అని కూడా పిలవొచ్చని తెలిపారు. '21వ శతాబ్దంలో ఒక కొత్త చక్రవ్యూహం ఏర్పడింది. అభిమన్యుడిలా దేశంలోని యువకులు, రైతులు, మహిళలు, చిన్న, మధ్యతరహా వ్యాపారులు ప్రస్తుతం ఆరుగురు వ్యక్తుల కారణంగా నలిగిపోతున్నారు. చక్రవ్యూహంలో ఆరుగురు వ్యక్తులు మోదీ, షా, మోహన్ భగవత్, అజిత్ ధోవల్, ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ' అని రాహుల్ పేర్కొన్నారు.
For Latest News and National News Click Here