Share News

Rahul Gandhi: అది కస్టోడియల్ మరణమే.. పర్భణీ ఘటనపై రాహుల్

ABN , Publish Date - Dec 23 , 2024 | 09:21 PM

పర్భాణిలో బాధిత కుటుంబాన్ని రాహుల్ గాంధీ సోమవారంనాడు పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాడ్లాడుతూ, దళితుడు కావడం, రాజ్యాంగాన్ని పరిరక్షిస్తున్నందున ఆ వ్యక్తిని హత్య చేశారని ఆరోపించారు.

Rahul Gandhi: అది కస్టోడియల్ మరణమే.. పర్భణీ ఘటనపై రాహుల్

పర్భణి: మహారాష్ట్రలోని పర్భణిలో ఇటీవల జరిగిన అల్లర్లలో అరెస్టయిన సోమనాథ్ సూర్యవంశీ మరణానికి పోలీసులే కారణమని, ఇది ముమ్మాటికీ 'కస్టోడియల్ డెత్' అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. పర్భాణిలో బాధిత కుటుంబాన్ని ఆయన సోమవారంనాడు పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాడ్లాడుతూ, దళితుడు కావడం, రాజ్యాంగాన్ని పరిరక్షిస్తున్నందున ఆ వ్యక్తిని హత్య చేశారని, ఇందుకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఆర్ఎస్ఎస్ బాధ్యత వహించాలని అన్నారు. ఇందుకు బాధ్యులైన వారికి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

S.Jaishnakar US Visit: అమెరికాలో జైశంకర్ కీలక పర్యటన


పర్భణి రైల్వే స్టేషన్ వెలుపల రాజ్యాంగ ప్రతి నమూనాను కొందరు దుండగులు డిసెంబర్ 10న ధ్వంసం చేయడంతో అల్లర్లు చెలరేగాయి. నిరసన కారులు పలు వాహనాలను, ఆస్తులను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో సుమారు 50 మందిని అరెస్టు చేశారు. వీరిలో శంకర్ నగర్‌కు చెందిన సోమనాథ్ సూర్యవంశీ ఉన్నారు. జ్యుడిషియల్ కస్టడీలో ఉండగా ఛాతినొప్పి రావడంతో డిసెంబర్ 15న కన్నుమూశాడు. దీంతో హింసాకాండ చెలరేగింది. అయితే, ఈ ఘటనపై జ్యుడిషియల్ దర్యాప్తునకు ఆదేశించామని, నిజం బయటపడుతుందని సీఎం ఫడ్నవిస్ అసెంబ్లీలో తెలిపారు. కస్టడీలో కొట్టినట్టు తేలితే బాధితులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.


ఇది కూడా చదవండి..

Karti Chidambaram: వారానికి 4 రోజుల పని చాలు.. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తితో విభేదించిన ఎంపీ

National : యూపీలో భారీ ఎన్‌కౌంటర్.. హతమైన ముగ్గురు ఖలిస్థానీ ఉగ్రవాదులు..

National Farmers Day: నేడు జాతీయ రైతు దినోత్సవం.. దీని చరిత్ర గురించి తెలుసా..

For National News And Telugu News

Updated Date - Dec 23 , 2024 | 09:21 PM