Share News

Rahul Gandhi: బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఏం చేసినా సరే.. ఇది చేసి తీరుతా..

ABN , Publish Date - Nov 26 , 2024 | 04:52 PM

తెలంగాణలో జరుగుతున్న కులగణన ప్రక్రియ.. ప్రజా ప్రక్రియ అని లోక్ సభ పక్షనేత రాహుల్ గాంధీ అన్నారు. భవిష్యత్‌లో కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రం అధికారంలోకి వచ్చినా కుల గణన చేస్తామన్నారు. అందరికి సమాన హక్కు కోసం తాను పోరాడుతున్నట్లు తెలిపారు.

Rahul Gandhi:  బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఏం చేసినా సరే.. ఇది చేసి తీరుతా..
Rahul Gandhi

ఢిల్లీ: కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇప్పటికే కుల గణన చేపట్టినట్లు లోక్ సభ పక్షనేత రాహుల్ గాంధీ తెలిపారు. సంవిధాన్ రక్షన్ అభియాన్‌లో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కుల గణన మొదలు పెట్టినట్లు తెలిపారు. కుల గణనలో అడిగే ప్రశ్నలు ఒక గదిలో కూర్చుకుని 15 మంది రూపొందించలేదని..తెలంగాణ ప్రజలే డిజైన్ చేశారని తెలిపారు. తెలంగాణలో జరుగుతున్న కులగణన ప్రక్రియ అధికారులు రూపొందించిన ప్రక్రియ కాదు...ఇది ప్రజా ప్రక్రియ అంటూ వ్యాఖ్యానించారు.


భవిష్యత్‌లో కాంగ్రెస్ ఏ రాష్ట్రం అధికారంలోకి వచ్చినా కుల గణన చేస్తామని అన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఏం చేసినా సరే కుల గణన ద్వారా రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితి ఎత్తివేస్తామని తెలిపారు. కుల గణన అనేది తాను పార్లమెంట్‌లో రాజ్యాంగంపై చేసిన హామీ అని వివరించారు. కులగణను పాస్ చేసి చూపిస్తానంటూ రాహుల్ గాంధీ ఛాలెంజ్ చేశారు. అందరికి సమాన హక్కు కోసం పోరాడుతున్నట్లు తెలిపారు. కుల గణన ద్వారా ప్రజా సమాచారం తెలుస్తుందని.. కుల గణన ద్వారా పాలసీలు నిర్ణయించబడతాయని వివరించారు.

Updated Date - Nov 26 , 2024 | 04:57 PM