Share News

Rahul Gandhi: మోదీకి ఎవరూ భయపడరు.. అమెరికా పర్యటనలో రాహుల్ సంచలన వ్యాఖ్యలు..

ABN , Publish Date - Sep 09 , 2024 | 10:10 AM

రాహుల్ గాంధీ ప్రధాని మోదీతో పాటు ఆర్‌ఎస్‌ఎస్‌ను టార్గెట్ చేశారు. భారత్ మొత్తం ఒక ఆలోచన అని ఆర్‌ఎస్‌ఎస్ నమ్ముతుందని.. కానీ భారతదేశం భిన్నత్వం కలిగిన దేశమని తాను విశ్వసిస్తున్నట్లు తెలిపారు. దేశంలో ప్రజలు భిన్నమైన అభిప్రాయాలను..

Rahul Gandhi: మోదీకి ఎవరూ భయపడరు.. అమెరికా పర్యటనలో రాహుల్ సంచలన వ్యాఖ్యలు..
Rahul Gandhi

మూడు రోజుల పర్యటనలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా టెక్సాస్‌ యూనివర్సిటీ విద్యార్థులతో జరిగిన ముఖాముఖిలో పాల్గొన్నారు. నిరుద్యోగ సమస్యతో పాటు దైవం, మతం, భారతదేశ రాజకీయాలపై రాహుల్ ప్రసంగించారు. మోదీ, ఆర్‌ఎస్‌ఎస్‌పై రేవంత్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. భారత్‌లో బీజేపీకి లేదా ప్రధాని మోదీకి ఎవరూ భయపడరనే విషయాన్ని ఇటీవల జరిగిన ఎన్నికలు నిరూపించాయన్నారు. ఇటీవల భారత్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయం మాత్రమే కాదని, దేశ ప్రజలందరి విజయమన్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే భారత్‌లో బీజేపీ లేదా భారత ప్రధాని మోదీకి ఎవరూ భయపడరనే విషయం అర్థమైందని, ఈ కారణంగానే బీజేపీ పూర్తిస్థాయి మెజార్టీ సాధించలేదన్నారు. భారత రాజ్యాంగంపై దాడిని అంగీకరించబోమంటూ ప్రజలంతా సాధించిన విజయంగా ఎన్నికల ఫలితాలు చూడాలన్నారు.

Kolkata: ఎంపీ పదవికి రాజీనామా.. సీఎం మమతకు ఘాటు లేఖ


టార్గెట్ ఆర్‌ఎస్‌ఎస్

రాహుల్ గాంధీ ప్రధాని మోదీతో పాటు ఆర్‌ఎస్‌ఎస్‌ను టార్గెట్ చేశారు. భారత్ మొత్తం ఒక ఆలోచన అని ఆర్‌ఎస్‌ఎస్ నమ్ముతుందని.. కానీ భారతదేశం భిన్నత్వం కలిగిన దేశమని తాను విశ్వసిస్తున్నట్లు తెలిపారు. దేశంలో ప్రజలు భిన్నమైన అభిప్రాయాలను కలిగి ఉన్నారని తెలిపారు. వారికి వారి స్వంత విభిన్న కలలు ఉన్నాయని, వారి ఆలోచనా విధానం భిన్నంగా ఉంటుందన్నారు. కులం, భాష, మతం, సంప్రదాయాల ఆధారంగా విభిన్న అభిప్రాయాలు, ఆలోచనలను వేరు చేయలేమన్నారు. కలలు కనే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందన్నారు. తమ పోరాటం వీటిపైనే కొనసాగుతుందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.

Elections: అందరి టార్గెట్ జమ్మూకశ్మీర్.. బీజేపీ ఆరో జాబితా విడుదల


ఆధునిక భారతదేశానికి రాజ్యాంగం పునాది

ఆధునిక భారతదేశానికి పునాది రాజ్యాంగమని రాహుల్ గాంధీ తెలిపారు. ఎన్నికల సమయంలో భారత ప్రధాని రాజ్యాంగంపై దాడి చేశారని.. ఈ విషయాన్ని తాను చెప్పడంలేదని, దేశంలోని లక్షలాది మంది ప్రజలు దీనిని అర్థం చేసుకున్నారని రాహుల్ గాంధీ తెలిపారు. నిరుద్యోగ సమస్యపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. భారత్‌తో పాటు అమెరికాలో నిరుద్యోగ సమస్య ఉందన్నారు. ప్రపంచంలో చాలా దేశాల్లో నిరుద్యోగ సమస్య లేదంటూ చైనా, వియత్నాంలను ఉదాహరణలుగా చెప్పారు. నిరుద్యోగ సమస్య లేని దేశాలు ఈ ప్రపంచంలో ఎన్నో ఉన్నాయన్నారు. గతంలో అమెరికా ప్రపంచ ఉత్పత్తి కేంద్రంగా ఉండేదన్నారు. ప్రపంచంలో దొరికే ఏ వస్తువైనా మొదట అమెరికాలో తయారయ్యేదని చెప్పారు. కారు, వాషింగ్ మెషిన్, టీవీ మొదలు ఏ వస్తువైనా అమెరికాలోనే తయారయ్యేవని చెప్పారు. మిగతా దేశాలు తయారీ రంగంపై దృష్టిపెట్టడంతో అమెరికాలో ఉత్పత్తి తగ్గిందని చెప్పారు. కొరియా, జపాన్, చైనా ఉత్పత్తి కేంద్రాలుగా మారాయని రాహుల్ గాంధీ తెలిపారు.


National Politics: మీడియాకు దూరంగా ఉండండి.. బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌కు నడ్డా సలహా..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More National News and Latest Telugu News

Updated Date - Sep 09 , 2024 | 10:10 AM