Rahul Gandhi: పర్భాని హింసాకాండ బాధితులను పరామర్శించనున్న రాహుల్
ABN , Publish Date - Dec 22 , 2024 | 07:27 PM
పర్భాణి రైల్వే స్టేషన్ వెలుపల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద రాజ్యాంగ ప్రతిరూపాన్ని కొందరు దుండగలు ధ్వంసం చేయడంతో డిసెంబర్ 10వ తేదీ సాయంత్రం భారీ నిరసనలు వ్యక్తమయ్యారు. ఈ క్రమంలో రెచ్చిపోయిన ఆందోళనకారులు పలు వాహనాలను ధ్వంసం చేశారు.
ముంబై: మహారాష్ట్రలో ఇటీవల హింసాకాండ చెలరేగిన పర్భాని (Parbhani)లో కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సోమవారంనాడు పర్యటించనున్నారు. పర్భాని హింసాకాండలో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు వ్యక్తుల కుటుంబాలను రాహుల్ పరామర్శిస్తారు.
Maharashtra: అన్నాహజారేను కలిసిన ఫడ్నవిస్
పర్భాని రైల్వే స్టేషన్ వెలుపల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద రాజ్యాంగ ప్రతిరూపాన్ని కొందరు దుండగలు ధ్వంసం చేయడంతో డిసెంబర్ 10వ తేదీ సాయంత్రం భారీ నిరసనలు వ్యక్తమయ్యారు. ఈ క్రమంలో రెచ్చిపోయిన ఆందోళనకారులు పలు వాహనాలను ధ్వంసం చేశారు. అంబేద్కర్‌వాది సోమ్‌నాథ్ సూర్యవంశీ, విజయ్ వాకొడే అనే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ అల్లర్లకు సంబధించి 50 మందిని పోలీసులు అరెస్టు చేశారు. సోమ్‌నాథ్ సూర్యవంశీ పోలీస్ కస్టడీలో మరణించినట్టు ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలను ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ అసెంబ్లీలో తోసిపుచ్చారు. పోలీసు కస్టడీలో తనను వేధించలేదని సూర్యవంశి స్వయంగా మెజిస్ట్రేట్ వాంగ్మూలంలో చెప్పాడని, చిత్రహింసలు పెట్టారనే సాక్ష్యాలు కూడా సీసీటీవీ ఫుటేజ్‌లో ఎక్కడా లేవని తెలిపారు. పర్భాని హింసాకాండపై న్యాయ విచారణకు ఆదేశించినట్టు చెప్పారు.
రాహుల్ పర్యటన ఓ డ్రామా..
పర్భానికి రాహుల్ రానుండటంపై బీజేపీ విమర్శలు గుప్పించింది. ఇదంతా ఒక డ్రామా అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, రెవెన్యూ మంత్రి చంద్రశేఖర్ బవాంకులే అన్నారు. ఇలాంటి డ్రామాలకు బదులు తన చర్యలతో సమాజానికి ప్రయోజనం చేకూర్చే పనులు చేస్తే బాగుంటుందన్నారు. సమాజంలోని అన్ని కమ్యూనిటీలను కలుపుకొని బీజేపీ, రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్నాయని చెప్పారు. కాగా, పార్లమెంటు వెలుపల బాహాబాహీ జరిగితే పట్టించుకోని రాహుల్ ప్రత్యేక విమానంలో ఇక్కడకు రానుండటాన్ని శివసేన నేత షైనా ఎన్‌సీ ప్రశ్నించారు. రాహుల్ కపటత్వాన్ని ప్రజలు అర్ధం చేసుకోగలరని అన్నారు. పర్భానీ హింసకాండపై తాము ఎలాంటి రాజకీయాలు చేయడం లేదని, సోమనాథ్ సూర్యవంశీ, ఆయన కుటుంబానికి తాము అండగా ఉంటామని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Arvind Kejriwal: మహిళా సమ్మాన్ యోజన, సంజీవని యోజన రిజిస్ట్రేషన్ ఎప్పట్నించంటే
Delhi: స్కూళ్లకు బాంబు బెదిరింపులు.. దొరికిపోయిన విద్యార్థులు
Rains: 25నుంచి మళ్లీ కుండపోత వర్షాలు..
For National News And Telugu News