Share News

Rahul Gandhi US visit రాహుల్ గాంధీ మూడ్రోజుల ఆమెరికా పర్యటన

ABN , Publish Date - Aug 31 , 2024 | 05:10 PM

లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ సెప్టెంబర్ 8 నుంచి 10 వరకూ అమెరికాలో పర్యటించనున్నట్టు ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ శామ్ పిట్రోడా తెలిపారు. సెప్టెంబర్ 8న ఢల్లాస్, 9-10 తేదీల్లో వాషింగ్టన్ డీసీలో రాహుల్ పర్యటిస్తారని చెప్పారు.

Rahul Gandhi US visit రాహుల్ గాంధీ మూడ్రోజుల ఆమెరికా పర్యటన

న్యూఢిల్లీ: లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సెప్టెంబర్ 8 నుంచి 10 వరకూ అమెరికాలో పర్యటించనున్నట్టు ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ శామ్ పిట్రోడా (Sam Pitroda) తెలిపారు. సెప్టెంబర్ 8న ఢల్లాస్, 9-10 తేదీల్లో వాషింగ్టన్ డీసీలో రాహుల్ పర్యటిస్తారని చెప్పారు.


రాహుల్ గత ఏడాది మేలో అమెరికాలో మూడు రోజుల పర్యటనను శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి ప్రారంభించారు. తన పర్యటనలో అక్కడి ప్రవాస భారతీయులను కలుసుకున్నారు. పలువురు యాక్టివిస్ట్‌లు, విద్యావేత్యలు, సివిల్ సొసైటీ సభ్యులతో కాలఫోర్నియా యూనివర్శిటీలో చర్చలు జరిపారు.

Vinesh Phogat: రైతు నిరసనల్లో పాల్గొన్న వినేష్ ఫోగట్.. రాజకీయ ప్రవేశంపై ఏమన్నారంటే..?


వెల్లువెత్తుతున్న విజ్ఞప్తులు

రాహుల్ గాంధీ సెప్టెంబర్‌లో జరిపే అమెరికా పర్యటనపై శామ్ పిట్రోడా మాట్లాడుతూ.. ''రాహుల్ గాంధీ విపక్ష నేత అయినప్పటి ఆయనతో ముఖాముఖీ కోరుతూ ఇండియన్ ఓవర్సీస్ చైర్మన్‌గా ఉన్న నాకు 32 దేశాలకు చెందిన భారతీయ దౌత్యవేత్తలు, విద్యావేత్తలు, వ్యాపారులు, నేతలు, అంతర్జాతీయ మీడియా, ఇతరుల నుంచి విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. స్వల్ప పర్యటన కోసం రాహుల్ ఆమెరికా వస్తున్నారు'' అని తెలిపారు. 8న ఢల్లాస్, 9-10 తేదీల్లో వాస్టింగ్టన్ డీసీలు ఉంటారని, టెక్సాస్ యూనివర్శిటీ విద్యార్థులు, విద్యావేత్తలు, కమ్యూనిటీ ప్రజలతో ఇంటరాక్షన్ ఉంటుందని, పలువురు టెక్రోక్రాట్లను కలుసుకునంటారని, డల్లాస్ ప్రాంత నేతలతో డిన్నర్‌లో పాల్గొంటారని తెలిపారు. ఆ మరుసటి రోజు వాషింగ్టన్ డీసీలో కూడా నేషనల్ ప్రస్ క్లబ్ సహా పలువురితో సమావేశమవుతారని, రాహుల్ అమెరికా పర్యటన విజయవంతం చేయడానికి తామంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని చెప్పారు.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 31 , 2024 | 05:10 PM