Maharashtra: 'మహా' అసెంబ్లీ స్పీకర్‌గా రాహుల్ నార్వేకర్ ఏకగ్రీవం
ABN , Publish Date - Dec 08 , 2024 | 04:52 PM
స్పీకర్ ఎన్నికలో భాగంగా రాహుల్ నార్వేకర్ సోమవారంనాడు తన నామినేషన్ పత్రాన్ని రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఆయన వెంట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఉప ముఖ్యమంత్రులు ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాంకులే, చంద్రకాంత్ పాటిల్ తదితరులు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ కొత్త స్పీకర్‌గా బీజేపీ ఎమ్మెల్యే రాహుల్ నార్వేకర్ (Rahul Narvekar) ఎలాంటి పోటీ లేకుండా ఎన్నికయ్యారు. స్పీకర్ పదవికి పోటీ చేయరాదని విపక్ష 'మహా వికాస్ అఘాడి' నిర్ణయించడం, నామినేషన్ వేయకపోవడంతో స్పీకర్‌గా రాహుల్ నార్వేకర్ ఎన్నిక ఏకగ్రీవమైంది. షెడ్యూల్ ప్రకారం ఈనెల 9న స్పీకర్ ఎన్నిక జరగాల్సి ఉండగా, బీజేపీ నుంచి రాహుల్ నార్వేకర్ ఆదివారంనాడు నామినేషన్ వేశారు. ఇతరులెవరూ నామినేషన్ వేయకపోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. అయితే, అధికారికంగా సోమవారంనాడు ఆయన ఎన్నికను ప్రకటిస్తారు.
Maharashtra: సీఎంను కలిసిన విపక్ష నేతలు.. ఆ పదవి తమకు కేటాయించాలని విజ్ఞప్తి
కాగా, స్పీకర్ ఎన్నికలో భాగంగా రాహుల్ నార్వేకర్ సోమవారంనాడు తన నామినేషన్ పత్రాన్ని రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఆయన వెంట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఉప ముఖ్యమంత్రులు ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాంకులే, చంద్రకాంత్ పాటిల్ తదితరులు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
డిప్యూటీ స్పీకర్ పదవిని ఆశిస్తున్న ఎంవీఏ
కాగా, స్పీకర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నేందుకు తాము సహకరిస్తామని, ప్రోటాకాల్ ప్రకారం విపక్ష కూటమి పార్టీల్లో ఒకరికి డిప్యూటీ స్పీకర్ పదవి కేటాయించాలని సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ను 'మహా వికాస్ అఘాడి' కోరింది. ఈ మేరకు ఎంవీఏ ప్రతిధుల బృందం ఫడ్నవిస్‌ను ఆదివారం కలిసింది.
ఇవి కూడా చదవండి..
Viral News: పుష్ప సినిమా స్టైల్లో బంగాళాదుంపల స్మగ్లింగ్.. అడ్డుకున్న పోలీసులు
Viral: కదులుతున్న కారు టాపుపై కూర్చుని పోలిసు అధికారి కుమారుడి పోజులు!
Read More National News and Latest Telugu News