Share News

Rain: మండుటెండలో కుండపోత...

ABN , Publish Date - May 12 , 2024 | 12:50 PM

మదురైలో శనివారం కురిసిన అకాల వర్షం వాతావరణాన్ని చల్లబరిచినప్పటికీ లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కన్నియాకుమారి(Kanniyakumari) సముద్రతీర ప్రాంతంలో వాతావరణంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా అక్కడక్కడా చెదురుమదురుగా వర్షాలు కురుస్తున్నాయి.

Rain: మండుటెండలో కుండపోత...

- లోతట్టు ప్రాంతాలు జలమయం

- వైగై నదిలో పెరిగిన నీటిమట్టం

చెన్నై: మదురైలో శనివారం కురిసిన అకాల వర్షం వాతావరణాన్ని చల్లబరిచినప్పటికీ లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కన్నియాకుమారి(Kanniyakumari) సముద్రతీర ప్రాంతంలో వాతావరణంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా అక్కడక్కడా చెదురుమదురుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అగ్నినక్షత్రం ఎండల బారి నుంచి ప్రజలు ఉపసమనం చెందుతున్నారు. మదురై జిల్లాల్లో శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ 34 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఇదికూడా చదవండి: ప్రేమలో విఫలమై.. డ్రగ్స్‌కు బానిసై.. చివరకు ఏమయ్యాడంటే..

తర్వాత మధ్యాహ్నం 2.30 గంటలకు ఉన్నట్టుండి ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో కుండపోతగా వర్షం కురిసింది. మదురై నగరంలోని అన్నానగర్‌, కేకేనగర్‌, తెప్పకుళం, సింహక్కల్‌, తెర్క్‌వాసల్‌, కాళవాసల్‌, పెరియార్‌ బస్టాండు ప్రాంతం, ఆరంపాళయం, క్రాస్‌రోడ్డు, సెల్లూరు, తందనేరి, సర్వేయర్‌ కాలనీ, ఐయ్యర్‌ బంగళా తదితర ప్రాంతాల్లో వర్షానికి వాతావరణం చల్లబడింది.. రహదారులు, పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ అకాల వర్షానికి మదురైలోని వైగై నది నీటిమట్టం పెరగడంతో అధికారులు పరీవాహక ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని అప్రమత్తం చేశారు. వైగై నది నుండి రామనాథపురం జిల్లాలో సెకనుకు 3 వేల ఘనపుటడుగుల చొప్పున సాగునీరు విడుదల చేస్తున్నారు.

ఇదికూడా చదవండి: Chennai: ముగ్గురుని బలితీసుకున్న వివాహేతర సంబంధం..

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - May 12 , 2024 | 12:50 PM