Rains: బంగాళాఖాతంలో 3 రోజుల్లో మరో అల్పపీడనం
ABN , Publish Date - Dec 28 , 2024 | 10:09 AM
బంగాళాఖాతంలో మూడు రోజుల్లో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు తెలిపారు. దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో ఏర్పడనున్న ఈ అల్పపీడనం మూడు రోజుల తర్వాత పడమటి దిశగా వాయువ్య బంగాళాఖాతంలో శ్రీలంకకు దక్షిణదిశగా కదలనుందన్నారు.
చెన్నై: బంగాళాఖాతంలో మూడు రోజుల్లో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు తెలిపారు. దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో ఏర్పడనున్న ఈ అల్పపీడనం మూడు రోజుల తర్వాత పడమటి దిశగా వాయువ్య బంగాళాఖాతంలో శ్రీలంకకు దక్షిణదిశగా కదలనుందన్నారు. ఈ అల్పపీడనం కారణంగా జనవరి 1, 2 తేదీల్లో సముద్రతీర జిల్లాల్లో పడమటి కనుమల సమీప జిల్లాలు, ఉత్తరాది జిల్లాల్లో చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపారు.
ఈ వార్తను కూడా చదవండి: VHP: ప్రభుత్వ నియంత్రణ నుంచి ఆలయాలకు స్వేచ్ఛ కల్పించాలి
జనవరి 3 నుంచి 8 వరకు పలు ప్రాంతాల్లో మంచుకురుస్తుందని, కొడైకెనాల్, ఊటీ(Kodaikanal, Ooty) తదితర ప్రాంతాలను దట్టమైన మంచు కప్పేస్తుందని తెలిపారు. జనవరి 10న ఈశాన్య రుతుపవనాలు కూడా రాష్ట్రం నుండి వెళ్ళనున్నాయని తెలిపారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో మంచుకురవడం, చలిగాలులు వీస్తూ, తరచూ జల్లులు పడుతూ ఎండలు కూడా బాగా కాస్తాయని వివరించారు.
ఇక ఉత్తరాది సముద్రతీర జిల్లాల వైపు దిశగా కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం పూర్తిగా బలహీనపడిందని, ఈ కారణంగా వచ్చే ఆరు రోజులపాటు రాష్ట్రంలో అక్కడక్కడా జల్లులు పడతాయని వివరించారు. నగరానికి సంబంధించినంత వరకు ఆకాశం మేఘావృతమై ఉంటుందని, కొన్నిచోట్ల ఉరుములు మెరుపులతో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు తెలిపారు.
ఈవార్తను కూడా చదవండి: 2025 Calendar: 2025 ఏడాదికి సెలవులు ఖరారు
ఈవార్తను కూడా చదవండి: సంగారెడ్డి సెంట్రల్ జైలు నుంచి విడుదల కానున్న లగచర్ల రైతులు
ఈవార్తను కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ చేతలు తక్కువ..
ఈవార్తను కూడా చదవండి: దారుణం.. రక్షించాల్సిన వారే ప్రాణాలు కోల్పోయారు..
Read Latest Telangana News and National News