Rains: ఆరు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..
ABN , Publish Date - Jul 09 , 2024 | 11:57 AM
రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే ఆరు రోజుల పాటు(Six days) వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు బలపడటంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తమిళనాడు(Tamil Nadu)లోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి.
- వాతావరణ శాఖ వెల్లడి
చెన్నై: రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే ఆరు రోజుల పాటు(Six days) వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు బలపడటంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తమిళనాడు(Tamil Nadu)లోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. దీనికితోడు బంగాళాఖాతంలో పశ్చిమ గాలులు బలంగా వీస్తున్న కారణంగా తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కాల్ ప్రాంతాల్లో కొన్ని చోట్ల వర్షపు జల్లులు కురుస్తున్నాయి. ముఖ్యంగా చెన్నై నగరం(Chennai city)లోని అనేక ప్రాంతాల్లో రాత్రిపూట జల్లులు పడుతున్నాయి. ఆదివారం రాత్రి కూడా పలు ప్రాంతాల్లో తేలిక నుంచి మోస్తరు వర్షం కురిసింది. రానున్న 24 గంటల్లో ఆకాశం మేఘావృమై ఉంటుందని, నగరంలోన్ని చోట్ల తేలికపాటి వర్షపు జల్లులు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే, రాష్ట్రంలోని కోస్తాతీర ప్రాంతాలతో పాటు గల్ఫ్ ఆఫ్ మన్నార్ సముద్రతీరంలో గాలుల వేగం గంటకు 35 కిలోమీటర్ల నుంచి 45 కిలోమీటర్ల వేగంతో తీయొచ్చని, అందువల్ల జాలర్లు సముద్రంలో చేపల వేటకు వెళ్ళవద్దని వాతావరణ శాఖ సూచించింది.
ఇదికూడా చదవండి: జల్సాలకు అలవాటుపడి.. చోరీల బాట ఎంచుకుని..
ఈ జిల్లాలకు వర్ష సూచన
వచ్చే ఆరు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాలను వాతావరణ శాఖ వెల్లడించింది. తేని, నాగపట్టణం, తంజావూరు, వేలూరు, కోయంబత్తూరు, చెన్నై, తిరువారూర్, శివగంగై, దిండిగల్, తిరువళ్ళూరు, విల్లుపురం, కాంచీపురం, రామనాథపురం, పుదుక్కోట, మైలాడుదురై, చెంగల్పట్టు, రాణిపేట, తిరువణ్ణామలై జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News