Rains: 9 జిల్లాల్లో నేడు, రేపు వానలు..
ABN , Publish Date - Aug 07 , 2024 | 12:33 PM
రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది సాధారణం కన్నా అధికంగా వర్షిస్తున్న నేపథ్యంలో, కొన్ని జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ కనుమలను ఆనుకుని ఉన్న జిల్లాల్లో వారం రోజులుగా మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.
చెన్నై: రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది సాధారణం కన్నా అధికంగా వర్షిస్తున్న నేపథ్యంలో, కొన్ని జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ కనుమలను ఆనుకుని ఉన్న జిల్లాల్లో వారం రోజులుగా మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో బుధ, గురువారాల్లో చెంగల్పట్టు, కాంచీపురం, విల్లుపురం, కడలూరు(Chengalpattu, Kanchipuram, Villupuram, Cuddalore), డెల్టా జిల్లాలైన మైలాడుదురై, తంజావూరు, తిరువారూరు, నాగపట్టణం, పుదుకోట సహా పుదుచ్చేరి, కారైక్కాల్ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముందని ప్రాంతీయ వాతావరణ శాఖ ప్రకటించింది.
ఇదికూడా చదవండి: Bangladesh: హసీనాను అప్పగించండి.. భారత్‌కు బంగ్లాదేశ్ డిమాండ్
నగరంలోని ఒకటి, రెండు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురుస్తాయని, ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలిపింది. గడిచిన 24 గంటల్లో వాలాజా, సేలం జిల్లా ఆతూర్‌లో గరిష్టంగా 13 సెం.మీ వర్షపాతం నమోదైంది. చెంగం, కాట్పాడి, సలవై(Chengam, Katpadi, Salawai) ప్రాంతాల్లో మంగళవారం తేలికపాటి జల్లులు రాలాయి. ఉత్తర జార్ఖండ్ పరిసర ప్రాంతాలను ఆనుకొని బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వాయువ్య దిశగా కదులుతోందని, దీని ప్రభావం వల్ల ప్రకటించిన 9 జిల్లాల్లో రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశముందని పేర్కొంది. కాగా, సముద్రంలో 30 నుంచి 40 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
తడిసి ముద్దయిన వరి...
కడలూరు(Kadaluru) జిల్లాలో సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు పలు ప్రాంతాల్లో కురిసిన భారీవర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బన్రూట్టి నియోజకవర్గ పరిధిలోని చెమ్మకోట ప్రభుత్వ మార్కెటింగ్ యార్డ్‌కు రైతులు తరలించిన 500లకు పైగా ధాన్యం బస్తాలు వర్షంలో తడిసి ముద్దయ్యాయి. మరోవైపు జిల్లాలో కోతకు సిద్ధంగా ఉన్న వరిపైరు నీటమునిగింది. అప్పులు చేసి ఆరుగాలం పండించిన పంటలు వర్షార్పణమయ్యాయని, ఆర్ధికంగా నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని బన్రూటి ప్రాంత రైతులు కోరుతున్నారు.
వర్షాకాలంలో మార్కెటింగ్ యార్డ్‌కు తరలించే ధాన్యం తడవకుండా తగిన చర్యలు తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు. ఇదిలా ఉండగా, సేలం జిల్లా మేట్టూరు డ్యాం(Mettur Dam) నీటిమట్టం పూర్తి సామర్ధ్యం 120 అడుగులుగా కొనసాగుతోంది. కర్ణాటక పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా అక్కడి నుంచి విడుదల చేస్తున్న మిగులు జలాలతో డ్యాం నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. డ్యాం నుంచి సెకనుకు 26,000 ఘనపుటడుగుల మేర సాగునీరు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఇదికూడా చదవండి: TG News: పీవీఆర్ ఎక్స్‌ప్రెస్ హైవే పైనుంచి దూకిన గుర్తు తెలియని వ్యక్తి
ఇదికూడా చదవండి: RBI Official: రూ.40 కోట్ల ఆర్థిక మోసం కేసు.. బషీద్‌కు ఆర్‌బీఐ అధికారి సహకారం?
ఇదికూడా చదవండి: KTR: రాష్ట్రంలో త్వరలో ఉప ఎన్నికలు!