Rains: బలపడిన అల్పపీడనం.. మరో ఆరు రోజులు వర్షాలు..
ABN , Publish Date - Dec 19 , 2024 | 11:10 AM
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్రరూపం దాల్చింది. ఇది రానున్న 24 గంటల్లో వాయువ్య దిశగా పయనించి దక్షిణ తమిళనాడు-దక్షిణ ఆంధ్రప్రదేశ్(Tamil Nadu-South Andhra Pradesh)లోని కోస్తా ప్రాంతాల మీదుగా పయనించనుంది.
చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్రరూపం దాల్చింది. ఇది రానున్న 24 గంటల్లో వాయువ్య దిశగా పయనించి దక్షిణ తమిళనాడు-దక్షిణ ఆంధ్రప్రదేశ్(Tamil Nadu-South Andhra Pradesh)లోని కోస్తా ప్రాంతాల మీదుగా పయనించనుంది. రానున్న 24 గంటల్లో ఆంధ్రా తీరం వెంబడి ఉత్తర దిశగా పయనించే అవకాశముంది. దీని ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కాల్(Tamil Nadu, Puducherry, Karaikal) ప్రాంతాల్లో ఈ నెల 24వ తేది వరకు వర్షాలు కురిసే అవకాశముందని చెన్నై వాతావరణ కేంద్రం తెలిపింది.
ఈ వార్తను కూడా చదవండి: Mumbai Boat Accident : ముంబై సముద్రతీరంలో పడవ ప్రమాదం
గురువారం ఉత్తర కోస్తా తమిళనాడులోని అనేక ప్రాంతాలు, మిగిలిన ప్రాంతాలు, పుదుచ్చేరి, కారైక్కాల్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. ఈ నెల 20 నుంచి 24వ తేది వరకు కూడా తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది.
చెన్నైలో ఉదయం నుంచే...
రాజధాని నగరం చెన్నైలో బుధవారం ఉదయం నుంచే తేలికపాటి జల్లులు కురిసాయి. ఆకాశం మేఘావృతంగా ఉంటూ కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. చిన్న వర్షం కావడంతో విద్యా సంస్థలు యధావిధిగా పనిచేశాయి.
జాలర్లకు హెచ్చరిక..
రాష్ట్రంలోని తీర ప్రాంతాలు, గల్ఫ్ ఆఫ్ మన్నార్, దానిని అనుకొని ఉన్న కన్నియాకుమారి సముద్రంలో గురువారం గాలుల వేగం 35 నుంచి 45 కి.మీ ఉంటుంది. కొన్ని సమయాల్లో 55 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశముంది. అందువల్ల ఆయా ప్రాంతాలకు జాలర్లు చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
ఈవార్తను కూడా చదవండి: Prasad Behra: షూటింగ్‌లో నటితో అసభ్య ప్రవర్తన
ఈవార్తను కూడా చదవండి: పదేళ్లు బీఆర్ఎస్ విధ్వంసం చేసింది: కోమటిరెడ్డి
ఈవార్తను కూడా చదవండి: CM Revanth: ఆ ఇద్దరు కలిసి దేశ పరువు తీశారు
ఈవార్తను కూడా చదవండి: నాపై ఇలాంటి ఆరోపణలు సిగ్గుచేటు..
Read Latest Telangana News and National News